తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకి వ్యతిరేకంగా సొంత పార్టీలో పెద్ద కుంపటి తయారవుతోందా? అవుననే అంటున్నారు... టీ టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకరరావు. కేసీఆర్ ను తెలంగాణ ద్రోహిగా భావించే ఓ 30 మంది సొంత నేతలే వేరు పడేందుకు ప్రయత్నాలు ప్రారంభించబోతున్నారని దయాకర రావు చెబుతున్నారు. కేసీఆర్ నాయకత్వాన్ని వ్యతిరేకించే ఆ 30 మంది అమరవీరుల స్థూపం వద్దకు కూడా రానివారు ఉన్నారని, ఇది తెలంగాణ వాదులను తీవ్రంగా బాధిస్తోందని ఎర్రబెల్లి అన్నారు. దమ్ముంటే అసెంబ్లీని రద్దుచేయాలని ఆయన కేసీఆర్ కు సవాల్ విసిరారు. ప్రజాస్వామ్య విలువలను తొక్కాలని ప్రయత్నిస్తే, అది ఆయనకే ముప్పుగా మారుతుందని విమర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో ఆత్మసాక్షిగా ఓటు వేస్తే అసంతృప్త వాదలు బయట పడతారని ఆయన అన్నారు. అప్పుడంటే చిన్నపార్టీ అసంతృప్తత పెల్లుబికింది. ఇప్పుడు అధికార పార్టీలో ఉండి ఫిరాయింపులకు ఎలా పాల్పడే సాహసం చేస్తారా?? దయాకర రావు గారికే తెలియాలి.