రామమందిరం ప్రస్తుతానికైతే రాం రాం!

May 30, 2015 | 01:28 PM | 3 Views
ప్రింట్ కామెంట్
Home_minister_rajanath_singh_about_ram_mandir_construction_niharonline

బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చి ఏడాది అయిపోయింది. ఈ ఏడాదిలో ఇంతవరకు కదపని అంశమేదైనా ఉంటే అది రామ మందిర నిర్మాణం. సున్నితమైన ఈ అంశాన్ని తాకితే పెద్ద దుమారం రేగే అవకాశం ఉందని భావించిన ప్రధాని మోదీ ఇప్పటిదాకా ఎక్కడా ప్రస్తావించలేదు. అయితే కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రస్తుతం క్లారిటీ పేరిట ఈ కుంపటిని కదిలించారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణం పై తామిప్పుడు ఎలాంటి ఆలోచన చేయటం లేదని రాజ్ నాథ్ ప్రకటించారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణం, ఆర్టికల్ 370 రద్దు వంటి అంశాలు రెండూ ముఖ్యమైనవే. ఇప్పటికిప్పుడు వీటికి పరిష్కారం లభించే అవకాశాలు లేవు. కానీ, వీటికంటే ఇంకా ముఖ్యమైనది దేశ అభివృద్ధియే అని ఆయన అన్నారు. లోక్ సభలో 370 సీట్లు గెలిస్తే తమ పార్టీ ప్రధాన ఎజెండాగా రామ మందిర నిర్మాణాన్ని అమలు చేస్తామని పార్టీ అధ్యక్షుడు అమిత్ షా ప్రకటించారు. ఈ విషయాన్ని ఆయన వద్ద ప్రస్తావిస్తే రామ మందిర విషయం చట్ట పరిధిలో ఉందని, హై కోర్టు రూలింగ్ పై చేసిన అప్పీలు సుప్రీంకోర్టులో విచారణ దశలో ఉందని, తామూ కూడా తీర్పు కోసం వేచి ఉన్నామని ఆయన అన్నారు. మొత్తానికి మీడియా ప్రశ్నలతో ఏం చెప్పాలో తెలియని హోంమంత్రి రామ మందిర విషయంలో మాత్రం క్లారిటీతో లేరనే విషయం స్పష్టమైంది. కరుడు గట్టిన బీజేపీ మిత్ర పక్షాలకు మరి మంత్రి గారి అభివృద్ధి స్టేట్ మెంట్ రుచిస్తుందో లేదో వేచి చూడాలి.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ