పాలాభిషేకం ఓ వైపు... ఆగ్రహాం మరోవైపు

August 20, 2015 | 01:56 PM | 4 Views
ప్రింట్ కామెంట్
AP_people_farmers_reaction_on_pawan_tweets_on_capital_land_niharonline

రాజధాని భూసేకరణ కోసం ఆంధ్రప్రదేశ్ చేపడుతున్న చర్యలకు వ్యతిరేకంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అధికార పక్షానికి ఎదురెళ్తున్నారు. ప్రజల తరపున, రైతుల తరపున పోరాడేందుకు తానెప్పుడూ సిద్ధమని మరోసారి ప్రకటించాడు.  ప్రత్యక్షంగా కాకపోయినా ట్విట్టర్ ద్వారా ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి భూసేకరణ వద్దంటు కోరుతున్నాడు. రైతుల ఉసురు పోసుకున్న ప్రభుత్వాలు బాగుపడలేదని గుర్తుచేస్తున్నాడు. అవసరమైతే ప్రత్యక్షంగా పోరాటం కొనసాగిస్తానని కరాఖండిగా చెప్పేశాడు. రాజకీయంగా చెడిన ఫర్వాలేదు గానీ ప్రజల కన్నీళ్లతో రాజధాని నిర్మాణం వద్దనుకున్న పవన్ నిర్ణయం నిజంగా ప్రశంసనీయం. కానీ, ఆయన  పడుతున్న తాపత్రయం పై ప్రజల నుంచి మిశ్రమ స్పందన వినిపిస్తోంది. దానికి నిదర్శనం గురువారం చోటుచేసుకున్న రెండు సంఘటనలే ప్రత్యక్ష ఉదాహరణ.

                  మంగళగిరి పట్టణంలోని అంబేద్కర్ సెంటర్ లో పవన్ కళ్యాణ్ ఫోటోకు రైతు, జనసేన కార్యకర్తలు పాలాభిషేకం చేశఆరు. నవ్యాంధ్ర రాజధాని భూసేకరణకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ట్విట్టర్ లో పవన్ చేసిన విజ్నప్తి అభినందనీయమని వారు పొగడ్తలతో ముంచెత్తారు. ఎంతోమంది సీనియర్ల కన్నా పవన్ ఎంతో మేలని, సినిమాలు చేసుకోకుండా తమ గురించి ఆలోచించి ఇంతలా కష్టపడుతున్నందుకు కృతజ్నతలని రైతులు తెలిపారు.   ఇదిలా ఉంటే మరో ప్రాంతంలో ఆయనపై విమర్శలు గుప్పిస్తున్నారు రైతులు. తుళ్లురూ మండంలోని రైతులు పవన్ చేసిన ట్వీట్లపై మండిపడుతున్నారు. రైతుల మధ్య చిచ్చు పెట్టేవిగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని వారంటున్నారు. 98 శాతం రైతులు స్వచ్ఛందంగా భూములు ఇస్తే, కేవలం 2 శాతం రైతుల కోసం చట్టం నుంచి మినహాయింపు ఇమ్మని పవన్ కోరటం కరెక్ట్ కాదంటున్నారు. 45 వేల మంది రైతులు త్యాగాలు మరిచి ముందుకు పోతుంటే వంద మంది కోసం ఇలా చేయటం సరికాదన్నారు. ప్రేమ ఉంటే అందరికీ ఒకే న్యాయం జరిగేలా కృషి చేయాలని వారంటున్నారు. మరీ మిశ్రమ స్పందనల మధ్య పవన్ పోరాటం ఎలా ఉంటుందో చూద్దాం..

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ