జూబ్లీహిల్స్ రోడ్ నం 65 కో ఆపరేటివ్ సొసైటీ లో ఇల్లు కట్టుకుంటానని బాబు తెలంగాణ రాష్ట్ర అధికారులకు దరఖాస్తు చేసుకోగా దాన్లో అవకతవకలున్నాయని తిరస్కరించేరు. ఒక ముఖ్యమంత్రి పరాయి అయినంత మాత్రాన భయం భక్తి ఉండొద్దా. ఆపాటి అప్లికేషన్ నింపడం చేత కానీ ముఖ్యమంత్రి గాని వారి కుమారుడు గానీ ప్రజలకు ఏ విధమైన దిశా నిర్దేశం చేస్తారు అనుకోవాలి. చంద్రబాబు మాత్రం దీన్లో కుట్ర ఉంది అనే ఆశాభావం వెల్లడించేరు. ఆ క్షణంలోనే తన తోటి ఆంధ్రోల్లందరూ ఏమయిపోతున్నారో అని బెంగ కూడ ప్రకటించేరు. కేసీఆర్ కి ఇటువంటి శాపం ఏనాటికీ కలగదు. దొరవారికి ఇళ్లు, వాకిళ్లూ, ఫాం హౌస్ లు సమస్తం ముంగిట్లోనే ఉన్నాయి. ఇంతా చేస్తే హైదరాబాదు కార్పొరేషన్ వారు అనుమతి మంజూరు చేసేసి తుస్సు మనిపించేరు. జరిగిన అక్రమానికి నిరసనలు, ధర్నాలు, కిరసనాయిలు డబ్బాలు వగైరా ఏమీ అవసరం పడకుండా కార్పొరేషన్ వాళ్లు రక్షించి సమాజంలో శాంతి భద్రతలు కాపాడి పుణ్యం కట్టుకున్నారు. తిరస్కరించడం, పర్మిషన్ ఇవ్వడం అధికారుల చేతిలో ఉండొచ్చుగాక! కుదరదన్నప్పుడు ఎందుక్కుదరదో కారణాలు చెప్పడం, సరేలే ఇల్లు కట్టుకోండి అన్నప్పుడు ఎందుకు కట్టుక్కోమంటున్నారో కూడా కారణాలు చెప్పాలా వద్దా? అంతా వీళ్లిష్టమేనా? ఇదేం పరిపాలన!