మాజీ ప్రధాని మనోహ్మన్ సింగ్ నేత్రుత్వంలోని యూపీఏ ప్రభుత్వంలో రైల్వేశాఖా మంత్రిగా పనిచేసిన పవన్ కుమార్ బన్సల్(66) ను సోమవారం మధ్యాహ్నం పోలీసులు అరెస్ట్ చేశారు. ఛండీఘడ్ లో ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. యూపీఏ హయాంలో రైల్వే మంత్రిగా పనిచేసిన బన్సల్ తప్పనిసరి పరిస్థితుల్లో రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయన మేనల్లుడు విజయ్ సింగ్లా రైల్వేలో ఉద్యోగాలకు సంబంధించి ముడుపులు తీసుకున్నారన్న ఆరోపణలు వచ్చి అరెస్టయ్యాడు. దీంతో ఆ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ బన్సల్ తన పదవికి రాజీనామా చేశారు. అనూహ్యంగా ఈరోజు పోలీసులు పవన్ బన్సల్ ను అరెస్ట్ చేయటం రాజకీయంగా చర్చకు దారితీసింది. ఆయన అరెస్ట్ కు గల కారణాలు తెలియరాలేదు.