అమరావతి శంకుస్థాపన అపశృతులు లేకుండా జరిగిందని ఆత్మానందం అనుభవిస్తున్న అగ్రనాయకులకు జయదేవ్ వ్యవహారం చెప్పులోని రాయి, చెవిలో జోరీగ చందాన కిర్రాకు పుట్టించింది.
తన పేరు శిలాపథకంపై లేనందుకు, మోడీ మొండిచేయి చూపినందుకు తన అసంతృప్తి వెళ్లగక్కిన గల్లా జయదేవుణ్ణి చిరంజీవి దేవాన్ష్ గారి తాతా చివాట్లు పెట్టినట్టు గుసగుసలు. దాంతో గల్లా నొక్కుకుని స్వరం పూడుకు పోయి స్ర్కీన్ ప్లే మారిపోయింది.
దేవాన్ష్ బాబు, తాత అంటే తమాషా కాదని సాక్షాత్తు మోడీ తన కళ్లజోడు ఆబుడతడికి తగిలించి సమస్యలన్నీ తన కళ్లతో చూడమని సింబాలిక్ గా సందేశం ఇచ్చేరని తెలివిమీారిన వారి అభిప్రాయం.
జయదేవ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ జరిగింది జాతీయ స్థాయి కార్యక్రమం అనీ, మనం ఆ లెవల్లోనే థింక్ చేయాలనీ, ఢిల్లీ కార్యక్రమంలో సర్పంచులు కానరారనీ వివరిస్తూ, తనలాంటి ఉన్నతమైన సంస్కారి శిలాఫలకాలపై పేరు నిమిత్తం కేరేజూట్ అనీ, లెఖ్కా జమా చేయ్యననీ,తాను అలాంటి ఇలాంటి వాణ్ణి కాదనీ వినయపూర్వకంగా విన్నవించేరు.
కార్యక్రమం సక్సెస్ అయిందని సంతోషించాలి గాని ఇటువంటి అల్పవిషయాలు పరిగణనలోకి తీసుకోవడం ఎంత తప్పో కూడా చెప్పినట్టు తెలిసింది. సర్వేజనా సుఖినో భవంతు! ఓం శాంతి శాంతిః!