వాళ్లిద్దరూ ఎదురుపడ్డా పలకరించుకోలేదట

April 04, 2015 | 01:04 PM | 43 Views
ప్రింట్ కామెంట్
modi_advani_stage_share_niharonline

బీజేపీ కురు వృద్ధుడు లాల్ కృష్ణ అద్వానీ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీల మధ్య దూరం నానాటికీ పెరుగుతోంది. సార్వత్రిక ఎన్నికలకు ముందు మోదీని ప్రధాని అభ్యర్థిగా పార్టీ ప్రకటించిన నాటి నుంచి వీరిద్దరి మధ్య సంబంధాలు చెడాయి. అయితే ఎప్పుడు కూడా ఈ విభేధాలు బయటకు కనబడలేదు. బెంగళూర్ లో జరుగుతున్న ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సదస్సు మాత్రం వారిద్దరి మధ్య విభేదాలున్నాయన్న స్పష్టమైన ఆధారాలు ఇచ్చేసింది. సదస్సుకు హాజరైన సందర్భంగా ఎదురుపడ్డ ఈ ఇద్దరు నేతలు మాట్లాడుకోవటం కాదు కదా... పరస్పర అభివాదం కూడా చేసుకోలేదు. అంతేగాక వేదికపై కూర్చున్న సందర్భంగా వారిరువురూ ఎడమొగం పెడమొగం గానే గడిపారు. భరత మాతకు అంజలి ఘటించేందుకు వచ్చిన అద్వానీ వచ్చిన సందర్భంగా అక్కడే ఉన్న మోదీ కనీసం ఆయన వైపు కన్నెత్తి చూడలేదు. ఇక వేదికపై కూర్చున్నంత సేపు అద్వానీ ఏదో ముళ్లపై కూర్చున్నట్లుగానే కనిపించారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ