సాధారణ, అసాధారణ పౌరులనే తెగలుంటాయా? గవర్నరుగారు నేను ఇప్పటివరకూ అసాధారణ పౌరుడిని అన్న అర్థం వచ్చేలా ఓ మాట అన్నారు. పైగా తొందరలోనే నేను సాధారణ పౌరుడిగా రూపాంతరం చెందబోతున్నానన్నారు. మనకి గతంలో శ్రేయుతులు శంకర్ దయాళ్ శర్మలాంటి పెద్ద మనుషులు గవర్నర్ గా చేసి అందరి మన్ననలు పొంది గౌరవంగా నిష్క్రమించేరు. అదేపదవిలో హిస్ హైనెస్ రాంలాల్ గారు, హర్ హైనెస్ కుమారి కుముద్ బెన్ జోషి ఆంధ్రప్రదేశ్ ను అలరించి చిరకాల కీర్తి సంపాదించి తెలుగువారి గుండెల్లో నిద్రపోతున్నారు.
త్వరలో నేను సాధారణ పౌరుడిగా మారబోతున్నానన్న నరసింహుని పాత్ర, చరిత్రలో అతగాడి స్థానం భవిష్యత్ నిర్ణయించగలదు.