దావూద్ పై పెద్దల సభలో కలకలం

May 06, 2015 | 06:00 PM | 126 Views
ప్రింట్ కామెంట్
ghulam_nabi_azad_about_dawood_niharonline

అండర్ వరల్డ్ డాన్ , ముంబై పేలుళ్ల సూత్రధారి దావూద్ ఇబ్రహీంపై రాజ్యసభలో బుధవారం పెద్ద రచ్చే జరిగింది. కాంగ్రెస్ ఎంపీ గులాంనబీ ఆజాద్ దావూద్ ఎక్కడున్నాడో కేంద్ర ప్రభుత్తం చెప్పాలని పట్టుబట్టడంతో అసలు గొడవ మొదలైంది. కేంద్ర హోంశాఖ సహయ మంత్రి హరిభాయ్ పార్తీభాయ్ చౌదురి మాట్లాడుతూ... దావూద్ ఎక్కడున్నాడో కేంద్రానికి తెలీదని బుధవారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో  ప్రతిపక్షానికి ఈ విషయమై పదునైన ఆయుధం దొరికినట్లయ్యింది. ఓ కరడుగట్టిన ఉగ్రవాది ఎక్కడున్నాడో తెలిసీ కూడా ప్రభుత్వం ఇంతవరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదని కాంగ్రెస్ తీవ్ర విమర్శలు గుప్పించింది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ