గోమాంసంపై ముఖ్యమంత్రీ కెలికారు

October 16, 2015 | 11:37 AM | 2 Views
ప్రింట్ కామెంట్
manohar-lal-khattar-beef-comments-niharonline

గోమాంసంపై దేశ వ్యాప్తంగా చిచ్చు రేగుతున్న విషయం తెలిసిందే. హిందూ భావ జాలాలున్న సంఘాలన్నీ ఓవైపు నిషేధం విధించాల్సిందేనని పట్టుబట్టడంతోపాటు ముందుగా చర్చ రేగింది. ఆపై కొన్ని చోట్లు గోమాంసం తింటున్నారంటూ అవతలి మతం వ్యక్తులపై దాడులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే దాద్రిలో గోమాంసం తిన్నాడన్న అనుమానంతో ఇఖ్లాక్ అనే వ్యక్తిని దారుణంగా హతమార్చిన విషయం కూడా తెలిసిందే. ఈ ఘటనపై నేతల వ్యాఖ్యలతో మరింత ఆజ్యం పోస్తున్నారు. ఇప్పటిదాకా కేంద్ర మంత్రులే ఇలాంటి విషయాల్లో ముందున్నారు అనుకుంటే. తాజాగా ఓ ముఖ్యమంత్రి ఈ గోమాంసం, దాద్రి ఘటనపై తీవ్ర వ్యాఖ్యలు చేసి ఇరకాటంలో పడ్డారు.

హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టార్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత్ లో ముస్లింలు హాయిగా బతకొచ్చని... కాకపోతే, వారు ఇక్కడ ఉండాలంటే గోంమాంస భక్షణను వదిలేయాల్సిందేనని ఆయన వ్యాఖ్యానించారు. హిందువులకు గోవులు అత్యంత పవిత్రమైనవని... ముస్లింలు ఆవు మాంసం తింటే హిందువుల పవిత్రమైన భావాలను అవమానించినట్టేనని స్పష్టం చేశారు. మన ప్రజాస్వామ్య దేశంలో అందరికీ స్వేచ్ఛ ఉంటుంది... అయితే దానికీ ఓ హద్దు ఉంటుందని అన్నారు.

ఇక దాద్రి ఘటనపై స్పందిస్తూ, "ఆ ఘటన జరగడం దారుణమే, కానీ, గోమాతను ఉద్దేశించి ఇఖ్లాక్ అవమానకర వ్యాఖ్యలు చేసి స్థానిక హిందువులను రెచ్చగొట్టాడు. అందుకే ఆ ఘటన జరిగింది" అని ఖట్టార్ అన్నారు. ఇక ఈవ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దీనిపై ఆర్జేడీ అధినేత లాలూతోసహా పలువురు అగ్రనేతలు మండిపడ్డారు. ఇప్పటికే రగులుతున్న గోమాంసం వివాదాన్ని సీఎం స్థాయిలో ఉన్న ఈయనగారి వ్యాఖ్యలు మరింత తీవ్రతరం చేశాయి.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ