రోజా చేసేది ముమ్మాటికి బూతు షోనే!

March 24, 2016 | 02:33 PM | 4 Views
ప్రింట్ కామెంట్
ysrcp-roja-jabardasth-judge-niharonline

వైసీపీ ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్ పై సంగ్ధిగ్దం కొనసాగుతుండగానే మరో వివాదం ఆమెను చుట్టుముడుతోంది. ‘జబర్దస్త్’ లాంటి ద్వంద్వార్థాలు వచ్చే షోలో ప్రజాప్రతినిధి అయిన ఎమ్మెల్యే రోజా జడ్జిగా ఎలా వెళతారంటూ హైకోర్టు న్యాయవాది చందోలు శోభారాణి విమర్శించారు.

ఆ షోలో జుగుప్సాకరమైన, ద్వంద్వ అర్థాలు వచ్చేలా ప్రవర్తిస్తుంటారు. అలాంటి షోకి ప్రజాప్రతినిధి అయిన  రోజా జడ్జిగా ఎలా వెళ్తారని శోభారాణి ప్రశ్నించారు. రోజాలాంటి వారు చట్టసభల్లో ఉన్నంతవరకు ఆడవారికే కాదు సమాజానికే నష్టం జరుగుతుందన్నారు. ఆడవారి ఆత్మస్థైర్యాన్ని, హుందా తనాన్ని దెబ్బతీసేలా ప్రవర్తిస్తున్న వైసీపీ ఎమ్మెల్యే రోజాను శాశ్వతంగా అసెంబ్లీలో అడుగుపెట్టకుండా చేయాల్సిన అవసరం ఉందని చందోలు శోభారాణి అన్నారు.

                మరోవైపు ఆమె సస్పెన్షన్ విషయంలో సింగిల్ జడ్జి ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవాలు చేస్తూ సర్కారు తరఫున దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. సస్పెన్షన్ చెల్లదంటూ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై స్టే మంజూరు చేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావులతో కూడిన ధర్మాసనం మంగళవారం తన నిర్ణయం వెలువరించింది. సింగిల్ బెంచ్ ఎదుట కౌంటర్ దాఖలు చేయాలని రోజాకు సూచించింది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ