ఏపీ ఎమ్మెల్యేకు హైకోర్టు లెఫ్ట్ అండ్ రైటు

April 16, 2015 | 12:06 PM | 60 Views
ప్రింట్ కామెంట్
AP_MLA_bandaru_madhava_naidu_high_court_niharonline

ఆంధ్రప్రదేశ్ అధికార టీడీపీ ఎమ్మెల్యేకు హైకోర్టు గట్టి ఝలకిచ్చింది. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవటమే కాకుండా కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారని ఆక్షేపిస్తూ రూ.1000 జరిమానాను విధించింది. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు. జిల్లా జడ్జితోపాటు న్యాయాధికారుల పట్ల దురుసుగా వ్యవహారించారని నమోదైంది. దీనిపై నిన్న హైకోర్టు చీఫ్ జస్టిస్ కళ్యాణ్ జ్యోతిసేన్ గుప్తా, జస్టిస్ సంజయ్ కుమార్ లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. న్యాయమూర్తులపై దురుసుగా ప్రవర్తించటం ప్రజాప్రతినిధిగా మీకెంతవరకు సమంజసమని ధర్మాసనం ఎమ్మెల్యేను ప్రశ్నించింది. ఇది చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడమే అవుతుందని, ఈ తరహా వైఖరి ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదని తీర్పు చెప్పింది.అంతేకాదు రూ.1000 జరిమానా కట్టాలని తీర్పు చెప్పింది. అయితే సదరు ఘటనకు సంబంధించి ఎమ్మెల్యే క్షమాపణ చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన తరపున న్యాయవాది ధర్మాసనానికి వివరించారు. అందుకు అంగీకరించిన కోర్టు క్షమాపణను రాతపూర్వకంగా సమర్పించాలని ఆదేశాలు జారీచేసింది.అంతే మరి న్యాయవ్యవస్థ ముందు ఎవరైనా ఒక్కటే కదా.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ