పక్కా తెలంగాణ వాదిగా ఎప్పుడూ స్పీచ్ లు ఇస్తూ... అవకాశం వస్తే... టీఆర్ ఎస్ ను దుమ్మెత్తి పోసే టీ టీడీపీ నేత రేవంత్ రెడ్డి. పక్కా తెలంగాణా వాదిగా ఉంటూనే... ఆంధ్ర నేతలకు వత్తాసు పలికే గుణం ఆయనకు మొదటి నుంచీ సొంతం. అంతేకాదు నవ్యాంధ్ర రాజధాని నిర్మాణానికి వితరణ అందించిన ఔదార్యం, పెద్ద మనసు ఆయనది. ఇక్కడ ఆత్మహత్యలు చేసుకున్న వారి కుటుంబాలకు ఒక్క పైసా ఇవ్వలేదనుకోండి అది వేరే విషయం. ఇక అధినేత చంద్రబాబును తుమ్మినా, దగ్గినా అది కూడా తెలంగాణ మంచికే అని వత్తాసు పలకడం ఈయన నైజం. ఇన్నాళ్లు ఆంధ్ర నేతలకే అనుకుంటే ఇప్పుడు పర్సనల్ లైఫ్ లోకి కూడా ఆంధ్రాతత్వం వంట బట్టించుకుందామనుకుంటున్నారేమో. ఆయన తాజా నిర్ణయం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. పక్కా తెలంగాణ వాది అయిన ఆయన ఆంధ్రప్రదేశ్ తో వియ్యమందుకుంటున్నాడు. అవునండీ ఫార్టీ ప్లస్ లో ఉన్న ఈ ‘కుర్రాడి’ కి పెళ్ళీడు కూతురుంటుందని కూడా ఎవరూ ఊహించి ఉండరు. ఈయన కూతురు పేరు నైమిష. వచ్చే నెలలో వివాహం జరిపేందుకు రెడీ అయ్యారు. ఇంతకీ రేవంత్‌కు వియ్యమందుకునేది వెస్ట్ గోదావరి జిల్లాకి చెందిన ఓ శ్రీమంతుడి అబ్బాయి. ఇప్పటికే ఇరు కుటుంబాలు పెళ్లి పనుల్లో బిజీగా వున్నాయి. వివాహం ఘనంగా జరిపేందుకు సన్నాహాలు జరిగిపోతున్నాయి. టీవీల్లో, పార్టీ మీటింగుల్లో రాజకీయ మాటలు వేరు.... పర్సనల్ లైఫ్ వేరు కదా... అనుకున్నా... టీఆర్ ఎస్ నేతలు ఊరుకుంటారా? అయినా తెలంగాణకు కయ్యాలవారిగా భావించే ఆంధ్రతో వియ్యం కరెక్టో కాదో మనకెందుకు లేండి.