దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఓటుకు నోటు వ్యవహారంపైనే చర్చ నడుస్తోంది. ఒకానోక సమయంలో జాతీయ స్థాయి నేతగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పేరు బయటకు రావటం ఈ టాపిక్ ను బాగా హైలెట్ చేసింది. అయితే దీనిపై ఓ జాతీయ పత్రిక ప్రచురించిన కథనం కొత్త చర్చకు దారితీస్తోంది. ది ముంబై మిర్రర్ అనే ఆన్ లైన్ పత్రిక ప్రచురించిన వ్యాసంలో ఆంధ్రప్రదేశ్ కు కాబోయే ముఖ్యమంత్రి ఎవరూ అన్న విషయం పై ఆస్తికర కథనం ప్రచురించింది. మొండి పట్టుతో ఉన్న తెలంగాణ ఏసీబీ కోర్టు అనుమతితో అనుబంధ ఎఫ్ఐఆర్ లో గనుక చంద్రబాబు పేరు చేరిస్తే ఆయన తక్షణమే రాజీనామా చేస్తారని, ఆ వెనువెంటనే ఆయన అనుచరుడు, ప్రస్తుత కేంద్ర మంత్రి అయిన అశోకగజపతి రాజు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తారని పేర్కొంది. ఈ విషయాన్ని మొన్నామధ్య ఢిల్లీ వెళ్లిన సీఎం చంద్రబాబునాయుడు సైతం ప్రధాని, బీజేపీ సీనియర్ నేతల వద్ద ప్రస్తావించాడట. రేసులో యనమల లాంటి సీనియర్ నేతతోపాటు బాలకృష్ణ పేరు కూడా వినిపిస్తున్నప్పటికీ బాబు అశోకగజపతిరాజు పేరునే బలంగా ప్రతిపాదిస్తున్నట్లు తెలిపింది. తాత్కాలిక ముఖ్యమంత్రిగా అనుభవజ్నుడైన గజపతిరాజు అయితేనే కరెక్ట్ గా ఉంటుందని పార్టీలోని కొందరు సన్నిహితులు కూడా బాబుకు చెబుతున్నారట. ఈ విషయాలన్నీ ముంబై మిర్రర్ ప్రచురించటంతో ఇప్పుడు మరో కొత్త చర్చకు దారితీసింది.