యథా రాజా తథా ప్రజాః!

November 10, 2015 | 03:35 PM | 2 Views
ప్రింట్ కామెంట్
criminal_record_on_100_MLAs_who_won_bihar_poll_niharonline

బీహార్ రాష్ట్రం ఎన్నోవిధాల వెనుకబడ్డది గానీ నేర ప్రపంచానికి వేగు చుక్కలా కరదీపికలా భాసిస్తూనే ఉంది. ఉదాహరణకి మన రాష్ట్రానికి కూడా నాటు తుపాకులు వగైరా సరఫరా చేస్తూ పేరు నిలబెట్టుకుంటూ నేరస్థుల జాబితాలో బీహారీ బాబుల జాబితాకి భంగం వాటిల్లకుండా కాపాడుకుంటూ వస్తోంది. మొన్నజరిగిన ఎన్నికల్లో నెగ్గిన బుద్ధిమంతుల్లో అధికశాతం (దాదాపు 60శాతం), నేరం చేయకుండా ఉండలేక, చిన్న చిన్న నేరాల నుంచి దొపిడీలు, హత్యలు చేసి బెయిల్ పై వ్యాహ్యాళికి వచ్చిన దొరలు,  జైలు లోపలే బావుందనుకొన్న విశ్రాంత నేరస్థులు మరి కొందరు, ఇట్టి విధంగా సకల సజ్జనులూ బీహారుని ఏలడానికి సంసిద్ధంగా ఉన్నారు.

ప్రజాస్వామ్యంలో ఎవరి అభీష్టం మేరకు వారి నాయకుల్ని ఎన్నుకునే హక్కు ఉన్నందున బీహార్ లో నేరసామ్రాజ్యం ఏర్పడుతున్న పాపానికి రాజ్యాంగం తప్పులేదు గనక రాజ్యాంగాన్ని క్షమించి ఈ అయిదు సంవత్సరాలు పరిపాలన లోతుపాతుల్ని పరిశీలించి అవగతం చేసుకునే అవకాశం దక్కించుకున్న వర్తమాన బ్యాచ్ కి అభినందనలు!

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ