కోస్తాంధ్ర, సీమలను పంచేసుకుంటున్నారు

October 27, 2015 | 02:38 PM | 2 Views
ప్రింట్ కామెంట్
jagan-nara-lokesh-party-cadres-niharonline

పదేళ్ల తర్వాత తిరుగులేని విజయంతో అధికారంలోకి రావటంతోపాటు విభజన తర్వాత మిగిలిన రాష్ట్రాన్ని అభివృద్ధి చెందించే దిశగా అడుగులు వేస్తుంది టీడీపీ. పాలనాపరంగా నిదానంగా గాడిన పడుతున్న సమయంలో ప్రతిపక్ష వైకపా రాజకీయ బలం పుంజుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తుంది. అదే సమయంలో ప్రభుత్వ లోటుపాట్లను దొరకబుచ్చుకుని ఎండగట్టడంలో ప్రతిపక్షం ఘోరంగా విఫలమవుతుంది. పైగా రాజధాని శంకుస్థాపనకు గైర్హాజరితోపాటు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెళ్తూ ప్రజల్లో కూడా కాస్త వ్యతిరేకతను మూటగట్టుకుంటున్నారు అధినేత జగన్. అయితే ఇదే సమయంలో పార్టీని బలోపేతం చేసేందుకు కూడా ఆయన ప్రయత్నాలు ప్రారంభిస్తున్నారు.

టీడీపీ గట్టి పట్టున్న కోస్తాంధ్రలో తన పార్టీని బలోపేతం చేసుకునే దిశగా చర్యలు ప్రారంభించారు. ఈ మేరకు ఆయన ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన పార్టీ నేతలతో హైదరాబాదులో భేటీ అయ్యారు. ఆయా జిల్లాల్లో పార్టీ పటిష్టతకు తీసుకోవాల్సిన చర్యలపై ఆరా తీశారు. భవిష్యత్తులో ఆ జిల్లాల్లో పార్టీకి మరిన్ని సీట్లు వచ్చేలా చూసేందుకు ఎలాంటి వ్యూహం అవలంబించాలన్న అంశంపై ఆయన పార్టీ నేతల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించారుట. సాధారణంగా పార్టీలో ఎవరి అభిప్రాయాలను పట్టించుకోకుండా సొంత నిర్ణయాలు తీసుకుంటారని జగన్ పై అపవాదు ఉంది. ఇక ఇప్పుడు తాజా సమావేశాల్లో సీనియర్ల సలహాలను తీసుకోవటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

మరో వైపు ప్రతిపక్షం వైసీపీకి గట్టి పట్టున్న రాయలసీమ జిల్లాల్లో పార్టీ పటిష్టతపై టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ దృష్టి సారించారు. ఈ క్రమంలో సోమవారం నుంచే రంగంలోకి దిగిన ఆయన ఆయన పార్టీ ఏపీ శాఖ ప్రధాన కార్యదర్శులకు జిల్లాల బాధ్యతలను అప్పగించారు. నేటి ఉదయం పార్టీ ఉపాధ్యాయ విభాగం నేతలతో ఆయన ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఏపీలో ప్రత్యేకంగా రాయలసీమలో పార్టీని మరింత పటిష్టం చేసే దిశగా ఆయన కీలక దృష్టి సారించారు. ముఖ్యంగా యువ నేతలకు ఈ సమావేశాల్లో ప్రాధాన్యత నివ్వటం విశేషం.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ