అక్కడ జగన్-ఇక్కడ రేవంత్ ఒకేలా!

March 10, 2016 | 12:02 PM | 1 Views
ప్రింట్ కామెంట్
jagan-revanth_in-telugu-assembly-niharonline

తెలుగు రాష్ట్రాల అసెంబ్లీలలో ఏడాదిలో పెను మార్పు చోటుచేసుకుంది. ఓవైపు తెలంగాణలో టీటీడీపీ మొత్తం ఖాళీ అవగా, ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్ష సభ్యుల ఫిరాయింపులతో రేపో, మాపో జగన్ బ్యాచ్ ఖాళీ అన్నట్లుగా పరిస్థితి తయారయ్యింది.  ముఖ్యంగా ఇరు అసెంబ్లీలో ఏడాదిలో ఎంతో మార్పు కనిపిస్తోంది. ఒకసారి అది పరిశీలిస్తే...

                               గత ఏడాది తెలంగాణ బడ్జెట్ సమావేశాలు జరిగినప్పుడు ప్రతిపక్షాలు అధికారపార్టీపై మాటల దాడులు చేసేవి, ప్రభుత్వ కార్యక్రమాలపై నిలదీసేవి. ప్రధానంగా టీడీపీ బడ్జెట్ సమావేశాల్లో ఆందోళనలు, నిరసనలు, ప్రశ్నలు, ఆరోపణలు, నిలదీతలు, విమర్శలతో సభను వేడెక్కించింది. దీంతో టీడీపీ సస్పెన్షన్ కు గురైంది కూడాను. ఇప్పుడు జరుగుతున్న బడ్జెట్ సమావేశాల్లో అందుకు పూర్తి భిన్నమైన వాతావరణం కనిపించనుంది. టీడీపీ నుంచి టీఆర్ఎస్ లోకి మొత్తం 12 మంది శాసనసభ్యులు మారిపోయారు. దీంతో టీడీపీ తరపున బలంగా వాదన వినిపించే అవకాశం కనబడకుండా పోయింది. ఇక కాంగ్రెస్ ఆరోపణలు చేసినా, వాటిల్లో టీడీపీ చేసే విమర్శలంత వాడీ వేడీ ఉండదని పలువురు పేర్కొంటారు. ఈ నేఫథ్యంలో రేవంత్ రెడ్డి ఒక్కరు అన్నీ తానై అధికారపక్షాన్ని ఇరుకున పెట్టగలరా? అని ఇంకొందరు గుసగుసలాడుతున్నారు.

ఇక ఇదే పరిస్థితిని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో జగన్ ఎదుర్కొంటున్నారు. అయితే జగన్ ది మరీ తెలంగాణలో టీడీపీ ఎదుర్కొంటున్నంత దుస్థితి కాదు. కాకపోతే సభలో బలంగా గొంతుక వినిపించే భూమా లాంటి సీనియర్ నేత వెళ్లిపోవటం పెద్ద లోటే. అదిగాక సభ్యులంతా ఒక్కోక్కరుగా వీడుతున్న సమయంలో తనతోపాటు గట్టిగా  అధికార పక్షాన్ని నిలదీసే నేతలు కరువు కావటం జగన్ కు నిజంగా పెద్ద దెబ్బే.

ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో జగన్, పరిస్థితి, తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి పరిస్థితి ఒకేలా తయారైందని సోషల్ మీడియాలో సెటైర్లు వినిపడుతున్నాయి.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ