జగన్ కాస్త ఓవర్ చేస్తున్నాడు

December 21, 2015 | 10:49 AM | 3 Views
ప్రింట్ కామెంట్
jagana-non-confidence-motion-against-speaker-kodela-niharonline

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్ష వైఎస్సార్సీపీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే సస్పెన్షన్ గొడవలతో దద్దరిల్లుతున్న ఏపీ అసెంబ్లీలో అధికార పక్షానికి షాకివ్వాలని డిసైడ్ అయ్యింది. స్పీకర్ కోడెల శివప్రసాద్ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని ప్రతిపక్ష నేత జగన్ నిర్ణయించారు. తమ ఎమ్మెల్యే ఆర్కే రోజాపై ఏడాది పాటు విధించిన సస్పెన్షన్ ను ఎత్తివేయాలని జగన్ స్పీకర్ ను కోరారు. దీనిపై ఘాటుగా స్పందించిన తెలుగుదేశం పార్టీ నిర్ణయంపై వెనక్కు తగ్గేది లేదని స్పష్టం చేసింది. దీంతో శీతాకాల సమావేశాలనే బాయ్ కాట్ చేస్తూ వైసీపీ బయటకు వచ్చేసింది.

ఆ తర్వాత వైసీఎల్పీ కార్యాలయంలో పార్టీ ఎమ్మెల్యేలతో భేటీ అయిన జగన్, స్పీకర్ పై అవిశ్వాస తీర్మానం పెట్టాలని నిర్ణయించింది. రేపు ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. అయితే సమావేశాలనే బాయ్ కాట్ చేసిన వైసీపీ... అవిశ్వాస తీర్మానాన్ని ఎలా ప్రవేశపెడుతుందన్న అంశంపై ప్రస్తుతం చర్చ జరుగుతోంది. మరోవైపు తమకు అవిశ్వాసం పెట్టే సంఖ్యాబలం లేదని, పెట్టినా అది దుది పింజలా ఎగిరిపోతుందని జగన్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ