టీ శాసనమండలి నుంచి టీడీపీ హాంఫట్

March 02, 2015 | 12:47 PM | 48 Views
ప్రింట్ కామెంట్
no_tdp_MLC_telangana_niharonline

తెలంగాణ రాష్ట్రంలో పార్టీ ఉనికితోపాటు ప్రాభవ్యాన్ని కొల్పొతూ వస్తున్న పార్టీ తెలుగుదేశం. వరుస వలసలతో ఆ పార్టీ నేతలంతా ఒక్కొక్కరుగా పార్టీకి దూరమైపోతున్నారు. ఇక శాసనమండలిలో కూడా త్వరలో ఆ పార్టీకి ఊహించని పరిణామం ఎదురుకానుంది. మండలి మొదలైన తర్వాత తొలిసారిగా ఆ పార్టీ నుంచి ఒక్కరంటే ఒక్క ఎమ్మెల్సీ కూడా లేకుండా పరిస్థితి త్వరలో దాపరించనుంది. ప్రస్తుతం తెలంగాణ శాసనమండలిలో ఆ పార్టీ తరపున వున్న ఏకైక ప్రతినిధి అరికెల నర్సారెడ్డి మాత్రమే. ఆయన పదవీ కాలం కూడా ఈ నెల 31తో ముగిసిపోనుంది. అంటే ఏప్రిల్ 1 నుంచి టీడీపీ నుంచి ప్రాతినిధ్యం వహించే వారే ఉండరు. నిన్న మొన్నటి వరకూ తెలుగదేశం నుంచి నలుగురు సభ్యులు ఉండగా, వారిలో ముగ్గురు టీఆర్ఎస్ లో చేరిపోయారు. ఇక ఏప్రిల్ ఒకటి నుంచి కొత్త సభ్యులను ఎన్నుకుంటారు. కనీసం 17 మంది మద్ధతుతో ఒక ఎమ్మెల్సీ విజయం సాధించే పరిస్థితి ఉండగా, తెలంగాణలో 15 మంది శాసనసభ్యులున్న టీడీపీ నుంచి ఇప్పటికే ముగ్గురు టీఆర్ఎస్ లోకి జంప్ అయ్యారు. ఇక మరి కొందరు కూడా ఇదే బాటలో ఉన్నారు. దీంతో కనీసం ఒక్క సభ్యుడినన్నా గెలిపించుకునే పరిస్థితి టీడీపీకి లేకుండా పోయింది. ఇక పట్టభద్రుల నియోజక వర్గాలకు ఎన్నికలు జరుగుతున్నప్పటికీ, అసలు టీడీపీ పోటీకే ముందుకు రాలేదు. దీంతో మండలిలో మరో నెల తర్వాత పూర్తిగా మాయంకానుంది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ