సాధారణ బడ్జెట్ పార్ట్-1

February 28, 2015 | 01:46 PM | 52 Views
ప్రింట్ కామెంట్
jaitely_budget_niharonline

కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ లోక్ సభలో శనివారం కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. 2015-16 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రతులను ఆయన చదివి వినిపించారు. అందులోని ముఖ్యాంశాలు కొన్ని… మైక్రో ఫైనాన్స్ కు ముద్ర బ్యాంకు ద్వారా రూ.20 వేల కోట్లు విడుదల. ఎంజీఎన్ రేగాకు రూ.5 వేల కోట్లు. అల్ట్రా మెగా పవర్ కు లక్ష కోట్లు. ఉపాధి హామీ పథకానికి అదనంగా రూ.5 వేల కోట్లు. 4 వేల మెగా వాట్ల సామర్థ్యం గల 5 మెగా పవర్ ప్లాంట్లు ఏర్పాటుకు నిర్ణయం. సీనియర్ సిటిజన్ల కోసం వెల్ఫేర్ ఫండ్. గ్రామీణ ఉపాధి హామీ పథకానికి రూ.34 వేల కోట్లు, వ్యవసాయ రుణాలు రూ.8.5 కోట్లు ఇవ్వాలనేది లక్ష్యం. మైక్రో ఫైనాన్స్ కు ముద్ర బ్యాంకు ద్వారా రూ.20 వేల కోట్లు. నాబార్డుకు 25 వేల కోట్లు. ఏడాదికి 330తో ప్రమాద బీమా. స్వయం ఉపాధి కార్యక్రమాల కోసం వెయ్యి కోట్లు. అటల్ పెన్షన్ యోజన కొనసాగుతుంది. యూనిఫైడ్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెటు ఏర్పాటుకు కృషి. ఐటీ హబ్ ఏర్పాటుకు 150 కోట్లు. శిశు సంరక్షణకు 300 కోట్లు. చైల్డ్ డెవలప్ మెంట్ కు 1500 కోట్లు. మౌలిక వసతులకు 70 వేల కోట్లు. స్టార్టప్ కంపెనీల కోసం వెయ్యి కోట్లతో మూల నిధి. చిన్న తరహా నీటి పారుదల ప్రాజెక్టులకు రూ.5300 కోట్లు. అత్యున్నత ఆదాయ వర్గాలకు గ్యాస్ సబ్సిడీ ఎత్తివేత. గ్రామీణాభివృద్ధికి రూ.25 వేల కోట్లు. 80 వేల స్కూళ్ల ఆధునీకీకరణ. దవ్యోల్బణం 6శాతానికి పెరగకుండా చర్యలు తీసుకుంటామని ఆయన ప్రకటించారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ