గ్రామీణాభివృద్ధికి 20 వేల కోట్లు కేటాయించటం. భారత్ ను తయారీ రంగానికి హబ్ గా చేయటం. కేంద్రం పన్నుల్లో 62శాతం నిధులను రాష్ట్రాలకు కేటాయించటం. జన్ ధన్ యోజన ద్వారా మధ్య తరగతి పేదలకు బీమా సౌకర్యం. గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించటం. ద్రవ్యోల్బణం 6 శాతం దాటకుండా చర్యలు తీసుకోవటం. ఎంపీలందరికీ గ్యాస్ సబ్సిడీ కట్. సబ్సిడీలను హేతుబద్ధీకరణ చేయటం. ఏడాదికి రూ.12 బీమాతో రూ.2 లక్షల ప్రీమియం. నష్టాల్లో ఉన్న ప్రభుత్వ సంస్థల నుంచి పెట్టుబడులు ఉపసంహరణ. ద్రవ్యలోటును మూడేళ్లలో 3 శాతానికి తగ్గించటం. ప్రతి కుటుంబంలో ఒకరికైనా ఉద్యోగ కల్పన. ఇండియాను తయారీ రంగం ద్వారా వృద్ధిలోకి తేవటం. స్కిల్ ఇండియా.. మేక్ ఇండియాకు మరింత ప్రాధాన్యం. 2015-16 వ్యవసాయానికి 8.5 లక్షల రుణాలు. స్కాలర్ షిప్ లు, ఎల్పీజీ సబ్సిడీలు నేరుగా లబ్ధిదారులకే అందేలా చర్యలు. ఇప్పటిదాకా 11.5 కోట్ల మందికి ఎల్పీజీ సబ్సీడీ అందించటం. 2015-16 మధ్య ఆర్ధిక అభివృద్ధి 8 నుంచి 8.5శాతం పెరిగే అవకాశం. యువతకు ఉపాధి అవకాశాలు కల్పన. 5.1శాతానికి తగ్గిన ద్రవ్యోల్భణం. ఇప్పటివరకు లక్ష కిలో మీటర్ల రోడ్లు నిర్మాణంలో ఉన్నాయి. మరో లక్ష కిలోమీటర్లు నిర్మించటమే లక్ష్యం. వ్యవసాయ, విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యం. 2022 నాటికి గ్రామాల్లో 4 కోట్లు, పట్టణాల్లో 2 కోట్లు ఇళ్ల నిర్మాణం. త్వరలో రెండంకెల వృద్ధిరేటును చేరుకోవటం. 2020 నాటికి ప్రతి ఇంటికీ విద్యుత్ సౌకర్యం. ప్రతి ఇంటకి మరుగ దొడ్డి, తాగునీరు అందిచటం. ప్రతి ఇంటికి 24 గంటలు విద్యుత్ సౌకర్యం. ఆర్థిక అభివృద్ధిలో ప్రజలందరిని భాగస్వాముల్నీ చేయటం. 340 బిలియన్ డాలర్లకు చేరుకున్న విదేశీ మారకపు నిల్వలు. పేదరిక నిర్మూలన, ఉద్యోగాల కల్పనకు ప్రాధాన్యం. భారత ఆర్థిక వ్యవస్థకు బడ్జెట్ దశదిశ నిర్దేశిస్తుంది. చివరగా భారత ఆర్ధిక వ్యవస్థకు ఈ బడ్జెట్ దశా నిర్దేశం చేస్తుందని జైట్లీ ప్రకటించారు. ప్రత్యక్ష నగదు బదిలీని కూడా త్వరలో ప్రవేశపెట్టనున్నట్లు, జీఎస్టీ 2016 ఏప్రిల్ 1నుంచి అమల్లోకి రానున్నట్లు ఆయన తెలిపారు. జీడీపీ వృద్ది రేటు 7.8 శాతం ఉంది.. ఇది మరింత పెరగనుంది. కరెంట్ అకౌంట్ లోటు మూడుశాతం. రూపాయి మారకం విలువ బలపడుతోంది అని మంత్రి పేర్కొన్నారు.