17న జయలలిత ప్రమాణ స్వీకారం ఉండదట...

May 14, 2015 | 02:02 PM | 30 Views
ప్రింట్ కామెంట్
jayalalitha_niharonline

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితను కోర్టు నిర్దోషిగా వెల్లడి చేసింది. ఇక జయలలిత మళ్ళీ  ‘సీఎం’ పగ్గాలు చేపడుతున్నారని అందరూ భావించారు.. ఈనెల 17వ తేదీన సీఎంగా జయ ప్రమాణస్వీకారం చేస్తారని అన్నాడీఎంకే పార్టీవర్గాలు తెలిపాయి కూడా. అయితే.. ఇప్పుడు ఆమె ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టడంపై ప్రతిష్టంభన ఏర్పడింది. ఈ నెల 15న శాసనసభాపక్ష సమావేశం నిర్వహించాలని భావించిన పార్టీ నేతలు ఆ కార్యక్రమాన్ని రద్దు చేసినట్టు తెలుస్తోంది. అందువల్ల 17న ప్రమాణ స్వీకారం ఉండదని కూడా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీనికి కారణం హైకోర్టు తీర్పుపై అప్పీలుకు వెళ్లాలంటూ రాజకీయ పక్షాల డిమాండ్ చేస్తుండడం వల్లనే అని తెలుస్తోంది. జయలలితను నిర్దోషిగా వెల్లడించిన కర్నాటక హైకోర్టు తీర్పుకు సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బుధవారం చెప్పారు. 19 ఏళ్ళ పటు నిర్దోషి అని కోర్టులో కేసు నడిస్తే,  3 నిమిషాల తీర్పు ఆమె నిర్దోషి అని ప్రకటించడంపై  డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్ తప్పుపట్టారు. తీర్పును సవరిస్తేనే అవినీతి నిర్మూలన సాధ్యమని పీఎంకే అధినేత రాందాస్ అన్నారు. ఇలా ప్రతిపక్షాల ‘అప్పీలు’ డిమాండ్లు పెరగడంతో జయ సీఎం ప్రమాణస్వీకారాన్ని రద్దు చేసినట్లు తెలుస్తోంది. అయితే నిర్దోషి అని కోర్టు తేల్చినా జయలలిత ఇంతవరకూ ప్రజల ముందుకు రాలేదు. తీర్పు వివరాలను న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాతే సీఎం పదవి చేపట్టే నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ