ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టు ఓ చురక అంటించింది. ఆయన మీడియాపై పెట్టిన క్రిమినల్ పరువునష్టం కేసులపై గురువారం సుప్రీంకోర్టు స్టే విధించింది. మీడియాపై ఆప్ సర్కారు జారీ చేసిన ఉత్తర్వులపై అత్యున్నత న్యాయస్థానం స్టే విధించింది. మీడియాపై పరువు నష్టం కేసు, చర్య తీసుకోవాలని కేజ్రీవాల్ కోరడాన్ని న్యాయస్థానం తప్పుపట్టింది. పార్టీని నాశనం చేసేందుకు మీడియా సుపారీ తీసుకుందని, మీడియా అమ్ముడుపోయిందంటూ గత వారం కేజ్రీవాల్ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. వాక్ స్వాతంత్ర్యపు హక్కును కోల్పోతున్నానని భావించిన కేజ్రీవాల్ మీడియాపై చర్యలకు దిగారు. మీడియా సంస్థలపై పరువు నష్టం దావా వేసే అధికారాన్ని కేజ్రీవాల్ సర్కారు గతంలో జీవో తీసుకువచ్చింది.