రైతు జన భాందవ జానా!

September 14, 2015 | 04:32 PM | 1 Views
ప్రింట్ కామెంట్
jana-reddy-on-telangana-farmers-suicide-niharonline.jpg

రైతు జన్మ ఆత్మహత్యల కోసమే నన్నట్లుంది. చాలా ప్రభుత్వాల హయాంలో మా సంరక్షణలో రైతన్న సుభిక్షంగా ఉన్నాడని ఏ పార్టీ అయినా నిజాయితీగా చెప్పుకోగలదంటారా? రైతుని అశ్రద్ధ చేస్తుండటంలో శ్రద్ధ వహిస్తున్నారుగానీ రైతన్న చెమట చుక్కల ఫలసాయపు భోజనం విషయంలో అశ్రద్ధకు తావులేదు. షడ్రసోషతంగా ఆరగిస్తూనే ఉంటారు. బక్కచిక్కిన రైతుల ప్రక్కటెముకలు మనకు కనిపించడంలో ఆశ్చర్యం లేదుగానీ, ఏ రాజకీయ కోణంగి కాలరు బోన్సు, తరక్కుపోయిన కడుపులు ఎపుడైనా, ఎక్కడైనా తారసపడ్డాయా... నహీ! ఇదంతా బహిరంగ రహస్యమే.

              కానీ, ఈ దౌర్భాగ్యం పురస్కరించుకుని జానారెడ్డి గారు వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో నేను ఊర్కోనుగాక ఊరుకోను, కరువు కోరల్లో ఉన్నవారిని ఆదుకోకపోతే ఊరుకుంటాననుకుంటారా, తాము అధికారంలో ఉండగా సమస్యల్ని ఊది అవతల పారేశాం అనే చారిత్రక, రాజకీయ, సామాజిక, వ్యవసాయక యదార్థాన్ని విడమరిచి చెప్పేరు. ప్రస్తుత ప్రభుత్వం ఇటువంటి వాటిలో తప్పించుకునే విద్యలు ప్రదర్శిస్తుంటే మేం చూస్తూ ఊరుకోం అని మళ్లీ చెప్పేరు. పనిలోపనిగా బేధాభిప్రాయాలకు పుట్టినిల్లయిన తమ పార్టీలో అభిప్రాయబేధాలుంటే ఊరుకునేది లేదని తెగేసి చెప్పారు. దేశం పట్ల పార్టీపట్ల, రైతులపట్ల, తనపట్ల, మనపట్ల, మీడియాపట్ల, అసెంబ్లీపట్ల, నిబద్ధత పాటించడమనగా ఇదే సజీవ సాక్ష్యం. జైకిసాన్!

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ