తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులపై కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి తన ఆవేదనను వ్యక్తంచేశారు. పార్టీ ఫిరాయింపులు, ఎమ్మెల్యేల కొనగొళ్ల విషయాలపై కాష్త అసంతృప్తి వెల్లగక్కారు. ప్రస్తుత రాజకీయాలు కలుషితమయ్యాయని, నీతి బాహ్యంగా మారాయని మీడియా ముందు ఆవేదన వెళ్లగక్కారు. టీఆర్ఎస్ పార్టీ ఫిరాయింపులు ఓవైపు, టీడీపీ కొనుగోళ్ల రాజకీయాలు రెండూ తప్పేనని పేర్కొన్నారు. తన పేరును రేవంత్ రెడ్డి ఉటంకించడాన్ని ఖండిస్తున్నానని, నీతిమాలిన చర్యలకు తానెప్పుడూ పాల్పడనని జానా స్పష్టం చేశారు. అధికారం కోసం ఒకరు, దాన్ని లాక్కోడానికి మరొకరు నిత్యం ఘర్షణ పడుతన్నారని ఆయన మండిపడ్డారు. మరి ఇలాంటి నేతలు ఇంట్లో(సొంత పార్టీలో) కూడా ఉంటారన్న, ఉన్నారన్న విషయం ఈ భీష్మ పితామహుడు మరిచినట్లున్నాడు.