భార్యను రేప్ చేస్తే కేసు లేదన్న మహిళా మంత్రి

March 11, 2016 | 11:59 AM | 2 Views
ప్రింట్ కామెంట్
menaka-gamdhi-marital-rape-niharonline

రేప్ చట్టాలను మరింత కఠినతరం చేయాలన్న నినాదాలు వినిపిస్తున్న వేళ, ఓ మహిళా మంత్రి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. వివాహబంధంతో ఒకటైన జంట మధ్య అత్యాచార కేసులు పెట్టే విధానం ఇండియాకు సరిపడదని కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖా మంత్రి మేనకాగాంధీ వ్యాఖ్యానించారు. భార్యకు ఇష్టంలేకపోయినా బలవంతగా కలవటం అత్యాచారం కిందే వస్తుందని గతంలో సుప్రీం కోర్టు పలు కేసుల్లో తీర్పునిచ్చింది. దీనిని ఉంటకిస్తూ మేరిటల్ రేప్ పై ఓ ఎంపీ అడిగిన ప్రశ్నకు ఆమె లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.

                              వైవాహిక అత్యాచారాలపై పాశ్చాత్య దేశాలు అర్థం చేసుకున్నట్టుగా ఇండియాలో అవగాహన లేదని ఆమె వివరించారు. ఇక్కడి అక్షరాస్యత, మత విశ్వాసాలు, వివాహబంధంపై ఉన్న నమ్మకం తదితరాల కారణంగా, వైవాహిక అత్యాచారాన్ని క్రిమినల్ కేసుగా పరిగణించలేమని అన్నారు. కాగా, గతేడాది కేంద్ర హోం శాఖ సహాయమంత్రి హరిభాయ్ సైతం ఇదే తరహా వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ