జేసీ ఎప్పుడూ ఏం మాట్లాడతాడో పరమాత్ముడికి ఎరుక. తపస్సు చేసినా ఏపీకి ప్రత్యేక హోదా రాదని నిష్ఠూరమైనప్పటికీ అదేదో దాన్ని బద్ధలు కొట్ చెప్పడం జరిగింది. ప్రస్తుతం దేశం సభ్యుడిగా ఉన్నప్పటికీ, ఇది తన రెండో మాతృసంస్థ అయినప్పటికీ ఏం మొహమాటం లేకుండా, ఎవరికి ఎక్కడ గుచ్చుకన్నా ఖాతరు లేకుండా తన యొక్క వాక్స్వాతంత్రం వాడుకుంటాడు. పార్టీకి నష్టమా లాభమా అనవసరం. జగన్ తమ వాడేనంటూ ఇంకా ఆ వృత్తిలో రాటుదేలాలని ఆశీర్వదించాడు. కోపము, ఆవేశము మున్నగు లక్షణాలు చంద్రబాబుకి స్వల్పపరిమాణంలో గలదని, జగన్ కి సదరు లక్షణాలు పుష్టిగా ఉన్నవనీ వెల్లడించాడు.
రాజకీయాల్లో ఈ లక్షణాలు వాంఛనీయమా కాదా అనేది డిబేటింగ్ సబ్జెక్ట్. చంద్రబాబు రాజీనామా చేసినా ప్రత్యేక హోదా కోసం పోరాటం చేసేందుకు సిద్ధపడితే పదిమంది ఎంపీలతో రాజీనామా చేయించి ఆ మహాయజ్నంలో సమిధలవ్వగలమని ప్రతిన బూనేడు. బాబు చాలా చికాగ్గా ఉన్న వర్తమాన పరిస్థితుల్లో రెడ్డిగారు ఆయనకు కితకితలు పెట్టడం ఏం ఆశించి అని పరిశీలకులు ఊహగానం అందుకున్నారు.