జూపూడి అభ్యర్థిత్వం మారనుందా?

May 21, 2015 | 10:36 AM | 30 Views
ప్రింట్ కామెంట్
jupudi_prabhakar_niharonline

ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో భర్తీ కావాల్సిన 6 ఎమ్మెల్సీ సీట్లకు అభ్యర్ధులను తెలుగుదేశం పార్టీ బుధవారం ఖరారు చేసింది. ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్లు దాఖలు చేయడానికి గురువారం ఆఖరి రోజు కావడంతో బుధవారం రాత్రి ముఖ్యమంత్రి చంద్రబాబు అభ్యర్థుల పేర్లను ఖరారు చేశారు. ఎమ్మెల్యే కోటా కింద భర్తీ చేయాల్సిన రెండు సీట్లకు ఎంఏ షరీఫ్‌ (పశ్చిమ గోదావరి), జూపూడి ప్రభాకరరావు (ప్రకాశం), గవర్నర్‌ కోటా కింద నాలుగు సీట్లకు సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి(నెల్లూరు), పంచుమర్తి అనురాధ(విజయవాడ), టీడీ జనార్థన్(కృష్ణా), గౌనివారి శ్రీనివాసులు నాయుడు(చిత్తూరు) ఎంపికయ్యారు. అయితే  జూపూడికి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని జిల్లాల్లో కాకుండా తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్‌లో ఓటు హక్కు ఉండటం ఎమ్మెల్సీ అభ్యర్థిత్వానికి అడ్డంకిగా మారే అవకాశం ఉంది.  ఎమ్మెల్యే కోటా కింద పోటీ చేసే అభ్యర్థులకు ఖచ్చితంగా సొంత రాష్ట్రంలో ఓటు హక్కు ఉండాలనే విషయాన్ని తెలుసుకున్న టీడీపీ అధిష్టానం ఎమ్మెల్సీ కోటాలో మార్పులు చేపట్టింది. ఈ క్రమంలో గవర్నర్‌ కోటాలో ఎంపికైన పంచుమర్తి అనురాధను ఎమ్మెల్యే కోటాకు మార్చి, జూపూడి ప్రభాకర్‌ను గవర్నర్‌ కోటాలోకి మార్చాలని భావించినట్టు సమాచారం అయితే గవర్నర్‌ కోటా కింద ఎమ్మెల్యేగా నామినేట్‌ అవడానికి సైతం సొంత రాష్ట్రంలో ఓటు హక్కు ఉండాలన్న నిబంధనను పలువురు అధిష్టానం దృష్టికి తీసుకువచ్చారు. దీంతో జూపూడి ఎమ్మెల్సీ అభ్యర్థిత్వం సందిగ్ధంలో పడింది. మరి జూపూడి విషయంలో అధిష్టానం ఏం నిర్ణయిస్తుందో వేచి చూడాలి. 

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ