కర్నె ప్రభాకర్ తెలంగాణ శాసనమండలి నాయకుడు. కేసీఆర్ అంటే వెర్రి అభిమానం. పేరు వినగానే పులకించిపోయే వీరశైవలింగ బలిజ. సారు సభలో మాట్లాడుతూ తన గాడ్ ఫాదర్ కేసీఆర్ పాదయాత్ర సందర్భాన్ని ఉటంకిస్తూ గద్వాల్ లో 120 డిగ్రీల జ్వరంతో ఒళ్లు పేలిపోతుండగా నడక కొనసాగించినట్లు తెలిపాడు. జ్నాన పురుషులు, స్త్రీలు సభలో ఉన్న తదితరులు, ఫకాల్న పళ్లు ఇకిలించేరు. కర్నెకు జ్నానోదయమై గురువుకి తాను ప్రసాదించిన 120 డిగ్రీల నుంచి 18 డిగ్రీలు వాపసు తీసుకుని ఆయన ప్రాణాలు దక్కించడం జరిగింది. గురువుగారికి థర్మామీటరు అనే గాజుగొట్టం ఒక కొలమానమా? ఎంత టెంపరేచరు వచ్చినా ఏమీ అవదు, భయం లేదు అనేది కర్ణుడి కవిహృదయమని గ్రహించవలెను!