విజన్ డాక్యుమెంట్ ను విడుదలచేసిన బీజేపీ

February 03, 2015 | 01:35 PM | 29 Views
ప్రింట్ కామెంట్

ఢిల్లీ అసెంబ్లీ ఎలక్షన్లకు సంబంధించి తమ పార్టీ తరపున ఎలాంటి మేనిఫేస్టో(ఎన్నికల ప్రణాళిక) ఉండబోదని బీజేపీ ప్రకటించిన విషయం తెలిసిందే. మేనిఫేస్టో స్ధానంలో విజన్ డాక్యుమెంట్ ఉంటుందని ఆ పార్టీ ప్రకటించింది. దీంతో మంగళవారం అందుకు సంబంధించిన దార్శనిక పత్రం(విజన్ డాక్యూమెంట్)ను విడుదల చేసింది. మొత్తం 270 అంశాలతో కూడిన విజన్ డాక్యుమెంట్ ను సీఎం అభ్యర్థి కిరణ్ బేడీ మీడియా సమక్షంలో విడుదల చేశారు. మహిళల భద్రత, యువతకు ఉపాధి, పర్యావరణం, విద్యుత్, తాగునీరు వంటి తదితర ప్రజా సమస్యలను ఇందులో పేర్కొని వాటిని రూపుమాపేందుకు క్రుషిచేస్తామని పత్రంలో పేర్కొంది. సుపరిపాలన అందించటం తద్వారా అన్ని ప్రభుత్వ విభాగాలలో అవినీతిని రూపుమాపటం, ఢిల్లీని ప్రపంచస్థాయి నగరంగా అభివ్రుద్ధి చేయటమే తమ లక్ష్యమని బీజేపీ స్ఫష్టంచేసింది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ