కాంగ్రెస్ పార్టీ గురించి ప్రస్తావిస్తూ తెలంగాణ అతి ముఖ్యమంత్రి జానారెడ్డిని పెద్దలు అని సంబోధించారు. అధికార, ప్రతిపక్ష సభ్యులు ఈ పిలుపులో ఏం చమత్కారం కనుగున్నారో మాములుగా కాకుండా, నవ్వుల్లో గల ఒక రకం అంటే ఘోల్లుమని నవ్వేరు. ఇరుపక్షాలూ ఈ బ్రాండుతో నవ్వడం వలన కేసీఆర్ గారికి చిర్రెత్తుకొచ్చి చిరుకోపంతో ఏమీ ఎందుకు నవ్వడం అని సుతారంగా విసుక్కున్నారు. వాతావరణ కాలుష్యాన్ని పారద్రోలే ప్రయత్నంలో కేసీఆర్ జానారెడ్డిని పొగడ్తలతో ముంచుతూ రెడ్డిగారి సూచనలు మానెత్తిన పెట్టుకోవడానికి రెడీ, ఒకేసారి ఏడు మంత్రిత్వశాఖలను అజమాయిషీ చేసిన దురంధురుడు కందూరి అని సీరియస్ గానే అభిలాషించేరు. జానారెడ్డి గారి మొఖంలో హైవోల్టేజీ లో వెలిగి, దేటంత అయినప్పటికీ నవ్వులు మాత్రం ముసి ముసిగా తగు మాత్రం వికసించేయి. అందరూ ఘోల్లున నవ్వి తెచ్చిన ప్రమాదానికి ముగింపు జానా ముసిముసిలు!