ఆప్ అవినీతి నేతలకు కేజ్రీవాల్ పాఠాలు

October 10, 2015 | 04:33 PM | 1 Views
ప్రింట్ కామెంట్
aravind-kejriwal-anti-corruption-class-to-MLAs-niharonline

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వెలుగులోకి వచ్చిందే ఈ అవినీతి వ్యతిరేక ఉద్యమం నుంచే. జన లోక్ పాల్ ఉద్యమంలో యూపీఏ-2 ప్రభుత్వానికి వ్యతిరేకంగా గురువు అన్నాహజారే చేపట్టిన ఉద్యమానికి మద్ధుతుగా నిలిచి నడిపించాడు. ఆపై అదే పాపులారిటీతో కాంగ్రెస్ కంచుకోట అయిన ఢిల్లీ లో గట్టిపోటీనిచ్చే బీజేపీని సైతం మట్టి కరిపించి అధికారంలోకి వచ్చింది ఈ ఏకే 47.

అలాంటి వ్యక్తి కేబినెట్ లో అవినీతిపరులకు ఆస్కారం ఉంటుందా? అవును. అఖండ విజయంతో ఢిల్లీ గద్దెనెక్కిన అరవిందుడి కేబినెట్ లో అవినీతి ఇప్పుడు కలకలం రేపుతుంది. ఆహార శాఖా మంత్రి   అసిం అహ్మద్ ఖాన్ అవినీతి వ్యవహారం ఇప్పుడు ఢిల్లీ రాజకీయాలను కుదేలు చేసింది. బిల్డర్ ల దగ్గరి నుంచి లంచం కొరుతూ వచ్చిన ఆడియో టేపులు బయటికి రావటంతో ప్రకంపనలు రేగాయి. దీనిని ఆయుధంగా చేసుకుని కాంగ్రెస్ నేతలు కేజ్రీవాల్ పై విమర్శలు చేశారు. ఒక వేళ కేజ్రీవాల్ నిజంగా అవినీతి వ్యతిరేక ఉద్యమం చెయ్యాలనుకుంటే ముందు జనలోక్ పాల్ గురించి ఆలోచించాలని, తన కేబినెట్ ను ప్రక్షాళన చెయ్యాలని సలహా ఇచ్చింది.

ఈ వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్న కేజ్రీవాల్ మీడియా సమావేశం నిర్వహించి మరీ అసిం ను మంత్రి పదవి నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించాడు. అంతేకాదు నేతలందరికి అల్టిమేటం జారీచేశాడు. అవినీతికి పాల్పడితే ఊరుకునేది లేదని హెచ్చరించాడు. అంతేకాదు ఆదివారం ఈ విషయమై ఎమ్మెల్యేలందరికీ క్లాస్ పీకనున్నట్లు తెలిపాడు. అసలు ఎమ్మెల్యేలు ఆప్ లో ఎందుకు చేరారో వారి నుంచి ఫీడ్ బ్యాక్ కూడా తీసుకోనున్నాడట. ఈ సమావేశానికి కుటుంబ సభ్యులతో కలిసి రావాలని ఆదేశాలు జారీచేశాడట. మొత్తానికి అసిం వ్యవహారం ఉదాహరణగా చూపి మిగతా ఎమ్మెల్యేలకు అవినీతిపై మంచి గుణపాఠం నేర్పాలని కేజ్రీ భావిస్తున్నట్లున్నాడు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ