సహచరులతో సహాగమనం సవ్యంగా నెరపలేని అరవింద్ కేజ్రీవాల్ స్థిమితం కోల్పోయి నోరు జారిపోతున్నాడు. మోదీ హవానెదిరించి ప్రధాని కోటలోనే పాగా వేసి ఔరా అనిపించుకున్న తదనంతర పరిణామాలు ఫూల్స్ ప్యారడైజ్ లో కామెడీ ఆఫ్ ఎర్రర్స్ ను తలపిస్తున్నాయి. నెగ్గించిన ఢిల్లీ ప్రజలను నిరాశపరుస్తున్నాయి. పార్టీలో ముఖ్య భూమిక పోషించిన ప్రశాంత్ భూషణ్, యోగేంద్ర యాదవ్ లను చిన్నబుచ్చే రీతిలో బయటకు సాగనంపేరు. దారి మీద దూషణలు అబాంఢాలను శరపరంపరగా గుప్పించసాగేరు. సాలా అని, కమినా అని వారిని సంబోధించేరు. సాలా అనగా బామర్ది, కమినా అంటే నీచుడు అని అర్థం. సాలా, కమినాలు ఇద్దరూ కుట్రపూరిత ధోరణిలో తనను ఓడించే ప్రయత్నం చేశారని అరవింద్ ఆక్రోశిస్తున్నారు. తన దారికి అవరోధంగా ఉన్నారనే వారిని అడ్డు తొలగించుకునే యత్నమే ఇదని ఆప్ పార్టీలో వారే చెవులు కొరికేసుకుంటున్నారట!