ఢిల్లీ ఎన్నికల కౌంటింగ్ లో భారతీయ జనతా పార్టీకి మరో పెద్ద షాకే తగిలింది. ఢిల్లీ ముఖ్యమంత్రి అభ్యర్థి కిరణ్ బేడీ ఓటమి పాలయ్యారు. బీజేపీకి కంచుకోటలాంటి కృష్ణనగర్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన ఆమె ఆప్ అభ్యర్తి ఎస్ కే బగ్గా చేతిలో పరాజయం పొందారు. కిరణ్ బేడీ 1150 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇక ఆమె పరిస్థితి ఎంతదారుణమంటే... ఇంటా గెలువలేదు, రచ్చ గెలవలేదు. ఆమ్ ఆద్మీలో ఉన్నప్పుడు ఆమె అంతగా ప్రభావం చూపలేకపోయింది... ఇప్పడు బీజేపీలో కూడా సేమ్ సీన్ రిపీట్ అయ్యింది. కాగా అసలు బీజేపీ సీఎం అభ్యర్థిగా కిరణ్ బేడీని ఎంపిక చేయడం ఆ పార్టీ చేసిన తప్పుగా కొంతమంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎన్నికల వచ్చే వరకూ బీజేపీ పరిస్థితి బాగానే కనిపించనప్పటికీ.. కిరణ్ బేడీ ఎంపికతోనే పార్టీ డీలా పడిందనేది ప్రధానంగా వినిపిస్తోంది. ఆ పార్టీ వెనక్కి తీసుకోలేనంత తప్పు చేసిందని విశ్లేషకులు చెబుతున్నారు.