ఢిల్లీలో ఎన్నికల ప్రచారం ఆఖరుకు చేరుకుంది. అభ్యర్థులంతా ఎవరికి వారే గెలుపు తమదని చెప్పేసుకుంటున్నారు. గెలుపుపై బీజేపీ అభ్యర్థి కిరణ్ బేడీ మాత్రం మరింత ధీమాతో ఉన్నారు. అసలు తాను గెలిచేందుకే రాజకీయాల్లోకి వచ్చిందట. ‘‘ దేవుడు నాకు అన్నీ ఇచ్చాడు. వేరే ఉద్ధేశాలు లేవు. విధి నన్ను రాజకీయాల్లోకి తీసుకొచ్చింది. ఓడిపోడానికి కాదు గెలవడానికే వచ్చా’’ అని బేడీ మీడియాతో తెలిపారు. ఆత్మప్రభోధానుసారం బరిలో దిగానని ఆమె వెల్లడించారు. తాను 14 ఏళ్ల ప్రాయం ఉన్నప్పటి నుంచే ఢిల్లీతో అవినాభావ సంబంధం ఉందని, టెన్నిస్ మ్యాచ్ ల కోసం తాను ఇక్కడికి వచ్చేదానినని వివరించారు. తనకు అవకాశం ఇస్తే ఢిల్లీని ఓ తల్లిలా ప్రేమిస్తానని ఆమె చెప్పారు.