కిషన్ రెడ్డి అలా సంతృప్తి చెందాల్సిందేనా?

February 06, 2016 | 12:49 PM | 1 Views
ప్రింట్ కామెంట్
kisanreddy-on-GHMC-results-niharonline

టీడీపీ, బీజేపీ కూటమికి ఘోర పరాభవం తప్పలేదు. గతంలో 45 డివిజన్లలో విజయం సాధించిన టీడీపీ తాజా ఎన్నికల్లో కేవలం ఒక్కటంటే ఒక్క డివిజన్ కు మాత్రమే పరిమితమైంది. ఇక ఆ పార్టీతో పొత్తుపెట్టుకుని మరీ బరిలోకి దిగిన బీజేపీ గతంతో పోలిస్తే ఓ సీటు కోల్పోయి నాలుగు డివిజన్లకే పరిమితమైంది. వెరసి ఈ రెండు పార్టీల కూటమికి గతంలో 50 డివిజన్లుంటే, తాజాగా ఆ రెండు పార్టీల బలం 5కు పడిపోయింది.

ఇక ఆత్మావలోకనం చేసుకున్న బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడారు. ప్రజల తీర్పును గౌరవిస్తున్నామని చెప్పిన ఆయన తాజా ఎన్నికల్లో సీట్లు తగ్గినా తమకు 18 శాతం ఓట్లు పోలయ్యాయని చెప్పారు. ప్రజల తీర్పును శిరసావహిస్తూ బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా ప్రజల పక్షాన పోరాటం కొనసాగిస్తామని ఆయన పేర్కొన్నారు. ఓ సీటు పోయినా వచ్చిన కేవలం వచ్చిన 4 స్థానాలతో ప్రతిపక్ష హోదాను దక్కించుకుని సంతృప్తిపడటం వారి వంతు అయ్యింది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ