చిరు కమలం తీర్థం కన్ఫర్మా?

September 25, 2015 | 05:41 PM | 2 Views
ప్రింట్ కామెంట్
chiranjeevi-kishan-reddy-BJP-niharonline

కాంగ్రెస్ లో ప్రాముఖ్యత లేకపోవటంతో పార్టీ మారే ఉద్దేశంలో ఉన్నాడని చిరంజీవిపై ఆమధ్య వార్తలు వచ్చాయి. అయితే రాహుల్ పర్యటన తర్వాత ఆ నిర్ణయం మారిందంటూ చిరు సన్నిహితులు తెలిపారు. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో చిరంజీవి తప్ప చరిష్మా ఉన్న నేతలు ఎవరూ లేరని నమ్మిన రాహుల్ మరిన్ని బాధ్యతలు అప్పగిస్తారని ఊహాగానాలు వచ్చాయి. అయితే అదంతా ఉత్తదే అని తెలుస్తోంది. దీంతో అధికార బీజేపీలో చిరంజీవి చేరుతారనే, ఆ దిశగా కిషన్ రెడ్డి పావులు కదుపుతున్నారని సమాచారం. కిషన్ రెడ్డికి చిరంజీవికి మంచి సంబంధాలు ఉండటంతో ఆయన ద్వారా కమలం తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలుస్తోంది.

ఈ మేరకు కిషన్ రెడ్డి కూడా బహిరంగంగా చేసిన కామెంట్లు దీనికి మరింత బలం చేకూరుస్తుంది. చిరంజీవి లాంటి చరిష్మా ఉన్న వ్యక్తి తమ పార్టీలోకి వస్తానంటే ఆనందంగా వెల్ కం చెబుతామంటూ కిషన్ వ్యాఖ్యానిస్తున్నారు.

                      మొత్తానికి ఏ మాత్రం ప్రాధాన్యం లేని పార్టీలో ఉండి అవమానం పాలయ్యే బదులు అధికార పార్టీలో ఉండి ఏ పదవి లేకున్నా గౌరవంగా ఉండొచ్చని చిరు అనుకుంటున్నట్లు తెలుస్తోంది. చిరు వస్తామంటే వద్దాంటామా అని ఓపెన్ ఆఫర్ కూడా ఇచ్చేశాడు. అన్నీ కుదిరితే చిరు కషాయం కండువా కప్పుకోవటం త్వరలోనే చూడొచ్చు, అది కూడా కిషన్ రెడ్డి ద్వారానే అన్నమాట. చిరుదే ఆలస్యం మరి.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ