చిన్నమ్మనే కాదు ‘ఆ నలుగురి’ని కూడా ఇరికించేశాడు

June 17, 2015 | 11:58 AM | 1 Views
ప్రింట్ కామెంట్
lalit_modi_sushma_swaraj_vasundara_raje_sharad_pawar_rajeev_sukhla_niharonline

వీసా డాక్యుమెంట్ల వ్యవహారంలో తనకు సహకరించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న సుష్మా స్వరాజ్ ను లలిత్ మోదీ వెనకేసుకొచ్చారు. కేవలం సుష్మానే కాదని, ఈ వ్యవహారంలో మరో నలుగురు నేతలు తనకు సహకరించారని చెప్పుకొచ్చాడు. యూపీఏలోని ఓ ముగ్గురు మంత్రులతోపాటు రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజే కూడా తనకు సహకరించారని ఆయన తెలిపారు. ప్రస్తుతం మాంటెనీగ్రోలో సెలవులపై ఉన్న మోదీ ఓ టీవీ చానెల్ కిచ్చిన ఇంటర్వ్యూలో ఈ బాంబు పేల్చారు. 2013 డిసెంబర్ లో వసుంధరా రాజే తన భార్యకు పోర్చుగల్ లో కాన్సర్ చికిత్స్ నిమిత్తం స్వయంగా తీసుకెళ్లారని, ఈ విషయం ఎవరికీ తెలియదని, తానిప్పుడు బయటపెడుతున్నానని అన్నారు. తనకు చాలా మంది రాజకీయ నేతలతో మంచి పరిచయాలున్నాయని వివరించిన లలిత్ ఆ ముగ్గురు మంత్రులు పేర్లు బయటపెట్టారు. యూపీఏ హయాంలో మంత్రులుగా ఉన్న శరద్ పవార్, ప్రఫుల్ పటేల్, రాజీవ్ శుక్లాలు తనకు ఎంతో సహాయం చేశారని చెప్పుకొచ్చారు.

                                 ఇక మోదీ వ్యాఖ్యలపై ఆయా నేతలను సంప్రదించగా, మూడేళ్లుగా అతనితో(లలిత్ మోదీ) మాటలు లేవని శుక్తా చెప్పగా, ఇండియాకు వచ్చి విచారణను ఎదుర్కొవాలని మాత్రమే సలహా ఇచ్చినట్లు శరద్ పవార్ తెలిపారు. ఇక రాజస్థాన్ సీఎం వసుంధరా రాజే స్పందిస్తూ... లలిత్ మోదీ కుటుంబం చానాళ్లుగా తనకు పరిచయం ఉందని, ప్రస్తుతం జరుగుతున్న డాక్యుమెంట్ల రాద్ధాంతం ఏంటో తనకు తెలియదని వసుంధరా రాజే వ్యాఖ్యానించారు. కాగా, మోదీ ఇచ్చిన ఈ ఇంటర్వ్యూను ఆధారం చేసుకుని ఇరు పార్టీలు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలకు దిగుతున్నారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ