ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై ఎన్టీఆర్ సతీమణి, వైసీపీ మహిళా నేత లక్ష్మీపార్వతి సెటైర్లలను ఓ రేంజ్ లో సంధించారు. అల్లుడి ఘన చరిత్ర తెలియాలంటే అత్తనే అడగాలంటూ ఆమె వ్యంగ్యం ప్రదర్శించారు. బాల్యంలో చంద్రబాబు ఘనకార్యాలను తల్లిగానీ, టీచర్లుగానీ అడ్డకుని ఉంటే, ఇప్పుడు రాష్ట్రానికి ఈ దౌర్భాగ్యం పట్టి ఉండేది కాదన్నారు. ఒకటవ తరగతిలోనే పక్కనుండే పిల్లాడి బలపం కొట్టేసిన ఘనుడు చంద్రబాబు అని వ్యాఖ్యానించారు. మామ అయిన ఎన్టీఆర్ వద్ద రూ.10 లక్షలు తీసుకుని ఆయన కుమార్తెను పెళ్లిచేసుకుని అల్లుడైపోయారని అన్నారు. కేజీ బేసిన్ లో సహజవాయు నిక్షేపాలు బయటపడినప్పుడు చక్రం తిప్పింది చంద్రబాబే నని ఆరోపించారు. రిలయన్స్ తో ఒప్పందం కుదుర్చుకున్నాడని వివరించారు. ఏదేమైనా, అల్లుడి చరిత్ర అత్తకే తెలుసేది కదా అంటూ చమత్కారాలతో ముంచెత్తారామె.