ఘన కార్యాలకు గ్రాండ్ వెల్ కమ్

July 02, 2015 | 02:59 PM | 10 Views
ప్రింట్ కామెంట్
revanth_reddy_jaya_lalitha_jagan_salman_khan_kanimozhi_niharonline

కనిమొళి, వైఎస్ జగన్, సల్మాన్ ఖాన్, జయ లలిత, తాజాగా రేవంత్ రెడ్డి, , ,  వీళ్ల పేర్లంతా జనాళ్ల నోళ్లలో బాగానే నానిపోయాయి. వీళ్లందరికీ ఒకే సారూప్యత కూడా, అది అందరికీ తెలిసిందే. తీవ్రమైన నేరాలు చేసి జైలు గోడల దాకా వెళ్లిన వీళ్లకు వారి అభిమానులు మాత్రం ‘‘వెల్ కమ్ బ్యాక్’’ అంటూ ఫ్లెక్సీలు కట్టి ఘన స్వాగతాలు పలకటం మనం చూశాం. అసలు వీళ్లు ఏం చేసి జైలు కెళ్లారు. ఏం చేశారని వాళ్లకు ఇంత ఘన స్వాగతాలు పరిశీలిస్తే... వరుసలో ముందుగా కనిమొళి. మాజీ ఎంపీ,  డీఎంకే అధినేత కరుణానిధి కుమార్తె. 2జీ స్పెక్ట్రమ్ కేసు, లక్షల కోట్లు చేతులు మార్పిడి జరిగిన ఓ భారీ కుంభకోణం. అనుమతులు లేకుండా లైసెన్స్ లు కట్టబెట్టడం, అనూహ్యంగా ఆ తెనేతుట్టే కదలటంతో ఈ బడా స్కాం వెలుగులోకి వచ్చింది. ఫలితం ఎంపీగా ఉన్న కనిమొళి తీహార్ జైలు ఊచలు లెక్కెట్టింది. ఆ తర్వాత బెయిల్ పై బయటికి వచ్చిందనుకొండి. నిజానికి ఆమె చేసింది ఆర్థిక నేరం. కొన్ని పశ్చిమ యూరప్ దేశాలలో ఆర్థిక నేరాలను తీవ్రంగా పరిగణిస్తారు. ఆయా కేసులో తీవ్రతలను బట్టి మరణశిక్షలను అమలుచేసిన సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. కానీ, ఇక్కడ ఆమె రాక సందర్భంగా చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. ఇక తర్వాత వరుసలో ఉంది వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్. ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టడం. తన తండ్రి దివంగత రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన ఒక ఎంపీ. ఇక సమయం నుంచి తండ్రి చనిపోయిన తర్వాత కూడా లక్షల కోట్ల సోమ్మును అవినీతి ద్వారా సంపాదించాడని ఆరోపణలు. దీనిపై దేశంలో ఎన్నడూ లేని విధంగా సీబీఐ (జేడీ లక్ష్మీ నారాయణ కృషి) విస్తృతంగా పరిశోధనలు చేసి ఆయన దోషి అని తేల్చింది.  ఫలితం ఏడాది పాటు జగన్ జైలు పాలయ్యారు. కానీ, ఏమైందో తెలీదు అనూహ్యంగా కేసు వీగిపోవటంతో ఆయనకు బెయిల్ దక్కింది. ఇక అప్పుడు జరిగిన ఊరేగింపు ఇప్పటికీ కళ్ల ముందు కదలాడుతోంది. జైలు నుంచి ఇంటి దాకా కార్యకర్తలు చేసిన కోలాహలం ఆహా... ఇక ఆయన చేసింది కూడా ఆర్థిక నేరమే. తర్వాతి వంతు తమిళనాడు తాజా సీఎం జయలలిత. అక్రమంగా ఆస్తుల కూడబెట్టారని పోరుగు రాష్ట్రం కదిలితేనే తప్ప తమిళనాడు నేతలకు కూడా తెలియలేదు. దాదాపు 17 ఏళ్లుగా సా...గిన ఈ కేసులో గతేడాది ఆమెను దోషిగా కర్ణాటక ప్రత్యేక న్యాయస్థానం తేల్చింది. దీంతో ఆమె తన సీఎం పదవికి రాజీనామా చేసి జైలుకు వెళ్లింది. కానీ, దురదృష్టవశాత్తు ఆమె ఎక్కువ రోజులు జైలులో గడపలేదు లేండి. అమ్మ భజనలను ఆస్వాదిస్తూ ఆరామ్ గా ఆమె బయటకు వచ్చింది. ఇక్కడ సేమ్ క్రైమ్. ఇక నెక్స్ట్ టర్న్ సినీ నటుడు సల్మాన్ ఖాన్. ఇది కొంచెం ప్రత్యేక కేసు ఎందుకంటే సెలబ్రిటీ కాబట్టి. అంతేకాదు ఈయన గారిపై ఏకంగా రెండు కేసులు పడి ఉన్నాయి. ఒకటి కృష్ణ జింకను వేటాడి చంపిన కేసు, మరోకటి ఫుల్లుగా తాగి వాహనం నడిపి ఒకరి మరణానికి కారణమవ్వటం. రెండూ జీవ హింసే. కానీ, ఇప్పటిదాకా దేనిలోనూ సార్ గారికి శిక్ష పడలేదు. సరికదా అత్తారింటికి వెళ్లోచ్చినట్లు ఈ మధ్య ఓ రెండు రోజలు జైలు మొహం చూసోచ్చారు.  ఇక చివరగా చెప్పుకొదగింది. రేవంత్ రెడ్డి. ఈయన గురించి చెప్పాలంటే ఈ పేజీలు సరిపోవు. చేసింది ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర. అది దేశ ద్రోహంతో సమానం. అంటే ఆయన మరణ(ఉరి) శిక్షకు అర్హుడు. కానీ, ఏమైంది నెలరోజుల వెకేషన్ తర్వాత గ్రాండ్ వెల్ కమ్ తో ఆయన బయటకు వచ్చేశారు. వచ్చే వాడు రావటమే సీఎం అని చూడకుండా కేసీఆర్ ను మరో రౌండ్ వేసుకున్నాడు. అంతేనా ఆయన అభిమాన గణం అయితే ఇంకా రెచ్చిపోయి పాటలు, స్వీట్లు, కటౌట్లు... ఆఖరికి సింగమలై గొడ్డలి కూడా బహుకరించారు. ఇంతకీ ఆయన దేనిపై పోరాటం చేశారు. ఎవరికీ కోసం చేశారు. ఇక్కడ న్యాయ వ్యవస్థను తప్పుబట్టడం లేదు. కానీ, ఇలాంటి తీవ్ర నేరాలలో జైలు వెళ్లి  బెయిల్ పై తిరిగి వచ్చిన వారికి ఏం పొడిచారని ఘన స్వాగతాలు పలకటం!!. కాస్త ఆలోచించండి.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ