శాఖాహారి ముఖ్యమంత్రి గుడ్లను నిషేధించాడు

June 02, 2015 | 04:56 PM | 4 Views
ప్రింట్ కామెంట్
shivraj_singh_chouhan_banned_eggs_niharonline

స్వతహాగా శాకాహారి అయిన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కోడి గుడ్ల వాడకంపై నిషేధాన్ని విధించటం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. అయితే అది రాష్ట్రం మొత్తం కాదు లేండి. చిన్నారులకు, గర్భిణీ స్త్రీలకూ పోషకాహారాన్ని అందించే అంగన్ వాడీ సెంటర్ లలో... కోడి గుడ్డును, గుడ్డు కూరను నిషేదిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. అయితే శక్తివంతమైన ఓ వర్గ ప్రభావం మేరకే అయినా ఈ నిర్ణయాన్ని తీసుకున్నారని పలు సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇంతకీ అసలు విషయమేంటంటే... రాష్ట్రంలో వెనుకబడ్డ జిల్లాలైన మాండ్లా, అలిరాజ్ పూర్, హోషంగాబాద్ లలో మూడేళ్ల నుంచి ఆరేళ్లలోపు చిన్నారులకు, మహిళలకు పౌష్టికాహారం కోసం ఉడికించిన గుడ్లను ఇస్తున్నారు. దీనిపై శాఖాహారాన్ని ప్రోత్సహించే ఓ వర్గం నిరసన తెలపటంతో శివరాజ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆ స్థానంలో కూరగాయలు, పండ్లు, పాలు ఇవ్వాలని ఓ మత సంఘ పెద్దలు డిమాండ్ చేశారట. ఈ డిమాండ్ కు తలోగ్గిన శివరాజ్ ఈ మేరకు ఉత్తర్వులు జారీచేశారని తెలుస్తోంది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ