మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత అశోక్ చవాన్ కు ఆదర్శ హౌసింగ్ సోసైటీ స్కాంలో ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసు ఛార్జీషీటులో గతంలో తన పేరు తొలగిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను రీకాల్ చేయాలంటూ చవాన్ దాఖలు చేసిన పిటిషన్ ను ముంబయి హైకోర్టు తిరస్కరించింది. పేరు తొలగించేందుకు న్యాయస్థానం నిరాకరించింది. దాంతో ఈ కేసులో చవాన్ నిందితుడిగా కొనసాగనున్నారు. 2010 లో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఈ స్కాం బయటపడగా ఆరోపణలతో ముఖ్యమంత్రిగా ఉన్న చవాన్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే.