హైదరాబాద్ లో బాగా పట్టున్న మజ్లిస్-ఏ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఎంఐఎం) ఇప్పుడు ఇతర రాష్ట్రాలపై ద్రుష్టిసారించింది. మహారాష్ట్ర ఎన్నికల్లో సంత్రుప్తికర ఫలితాలు రావటంతో తాజాగా తమిళనాడులోనూ పార్టీ విభాగాన్ని ఏర్పాటుచేయాలని పార్టీ భావిస్తోంది. ఇప్పటికే యూపీ లో కూడా పాగా వేయాలని ఆ పార్టీ తన ప్రయత్నాలను సాగిస్తోంది. అక్కడ వంద సీట్లకు పోటీచేయాలని ఆ పార్టీ భావిస్తున్నట్లు సమచారం. జై భీమ్- జై ఎంఐఎం నినాదంతో ఆ పార్టీ ఎన్నికలకు వెళ్లనున్నట్లు ఆ పార్టీ అద్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ తెలిపాడు. ఇక తమిళనాడులోని వివిధ ప్రాంతాల నుంచి దాదాపు 500 మంది ముస్లిం నేతలు హైదరాబాద్ కు వచ్చి అక్బరుద్దీన్ ఒవైసీని కలిశారట. పక్షం వ్యవధిలో తమిళనాడు ముస్లిం నేతలు హైదరాబాద్ రావటం ఇది రెండోసారి. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 27 న తమిళనాడులో మజ్లిస్ విభాగాన్ని ఏర్పాటుచేస్తామని అక్బర్ వారితో చెప్పినట్లు సమాచారం. దక్షిణాదిన బలపడాలని ప్రయత్నిస్తున్న బీజేపీ కి మజ్లిస్ చర్యలు కాస్ల ఇబ్బందినే కలిగిస్తాయని చెప్పవచ్చు.