రాహుల్ రాకపై సస్పెన్స్ వీడేనా?

April 13, 2015 | 03:37 PM | 37 Views
ప్రింట్ కామెంట్
rahul_gandhi_come_back_after_long_leave_niharonline

దాదాపు నెలరోజులకు పైగా సెలవు తీసుకున్న కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ నేడు తిరిగి రానున్నట్లు సమాచారం. ఆత్మపరిశీలన కోసం అంటూ ఆయన సెలవు తీసుకొని ఎక్కడికి వెళ్లారో కూడా తెలియకుండా జాగ్రత్త పడిన సంగతి తెలిసిందే. ఆయన రాకపై కాంగ్రెస్ సీనియర్ నేతలకు సమాచారం లేదని తెలుస్తోంది. ఈ రోజు వస్తున్నారని వార్తలు వెలువడ్డాయి. ఆయన కాంగ్రెస్ పార్టీలో అధ్యక్ష బాధ్యతలు స్వీకరిస్తారా? లేక మరి కొంత కాలం అమ్మ చూపిన బాటలో నడుస్తారా? అన్నది ఆయన వచ్చిన తర్వాతనే తెలుస్తుందని ఆ పార్టీ నేత మణి శంకర్ అయ్యర్ వ్యాఖ్యానించారు. అసలు ఆయనకు పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలని ఉందా? లేదా? అన్న విషయంపై కూడా రాహుల్ వస్తేనే తెలుస్తుందని అన్నారు. మరి రాహుల్ రాకపై నెలకొన్న సస్పెన్స్ ఇవాళైనా వీడుతుందో లేదో?

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ