రాజకీయాల్లో సన్యాసం, విరక్తి లాంటి పదాలు వినటం చాలా కష్టమైన పని. దెబ్బలు తిన్నా సరే అందులో పండిపోయిన వారు దానిని వీడటం మనం చూడలేదు కదా వినం కూడా. అంతలా కలిసిపోతారు నేతలు ఆ రూబిలో. అయితే అధికార పక్షంలో ఉన్నవారు రాజకీయాలపై విరక్తి మాటలు మాట్లాడితే అది వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. తాజాగా ఓ ఏపీ నేత చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలోని రాజకీయాలను ప్రశ్నించేలా ఉన్నాయి. వివాదాస్పద వ్యాఖ్యల జోలికి ఎన్నడూ వెళ్లని ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధ ప్రసాద్ ప్రస్తుత రాజకీయాలపై ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రస్తుతం సిద్ధాంతపరమైన రాజకీయలు లేవని, వాటికి కాలం చెల్లిపోయిందని వాపోయారు. కేవలం కుల రాజకీయాలే నడుస్తున్నాయని చెప్పారు. రాజకీయాల్లో కులాల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోందని అన్నారు. ఇది అత్యంత ఆందోళన కలిగించే అంశమని అభిప్రాయపడ్డారు. మేధావులంతా దీని గురించి ఆలోచించాలని, కుల రాజకీయాలను ప్రశ్నించాలని, లేకపోతే రాబోయే కాలంలో అనర్థాలు తప్పవని చెప్పారు. ఎంత గింజుకున్న మీ డిమాండ్ నెరవేరటం కష్టమేమో బుద్ధ... జరిగేది ఏం ఉండదు, ప్రభుత్వం ఇరకాటంలో పడటం, కుల రాజకీయాలను పాటించే ప్రతిపక్షం నవ్వుకోవటం తప్పా.