తగ్గించారు అనుకున్న టైంలో మళ్లీ మొదలెట్టారు మన మంత్రులు. అమ్మాయిల భద్రత గురించి పట్టించుకోవాల్సిన వారే అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. అమ్మాయిలు టైట్ డ్రెస్ లు వేసుకోవటం వల్లే రేప్ లు అని ఆ మధ్య ఓ మంత్రి వ్యాఖ్యానించి ఇబ్బందులు ఎదుర్కొగా తాజాగా మరో మంత్రి చేసిన కామెంట్లు దుమారం రేపుతున్నాయి. ఇండియాలో అమ్మాయిలు రాత్రి పూట తిరగడం మన సంప్రదాయాలకు విరుద్ధమని కేంద్ర సాంస్కృతిక వ్యవహారాల శాఖా మంత్రి మహేష్ శర్మ అన్నారు. "అమ్మాయిలు రాత్రిపూట తిరగడం ఇంకెక్కడైనా సరైనదే కావచ్చు. కానీ, భారత సంస్కృతిలో మాత్రం అది భాగం కాదు" అని ఓ టీవీ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన అన్నారు. అసలు రాత్రుళ్లు యువతులు ఎందుకు రోడ్లపై తిరగాలని ఆయన ప్రశ్నించారు.
జైనుల పండగ సందర్భంగా, వారిని గౌరవించేలా కొద్ది రోజులు మాంసానికి దూరమైతే తప్పేంటని కూడా ఆయన ప్రశ్నించారు. రెండు రోజుల పాటు త్యాగం చేయలేరా? అని అడిగారు. ఆర్ఎస్ఎస్ తో సుదీర్ఘ అనుబంధమున్న మనీష్ శర్మ తాజా వ్యాఖ్యలపై సామాజిక మాధ్యమాల్లో చర్చ జరుగుతోంది. ఆయనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవలే మాజీ రాష్ట్రపతి, దివంగత అబ్దుల్ కలాంపై కూడా అనుచిత వ్యాఖ్యలు తిని నెటిజన్లతో చివాట్లు తిన్నారు ఆయన. మరి వీరు ఎవరు చెబితె ఇలా మాట్లాడం మానుతారో అర్థం కావటం లేదు.