వావ్... మౌన ముని మండిపడటం చూడండి

May 07, 2016 | 11:11 AM | 2 Views
ప్రింట్ కామెంట్
manmohan-singh-modi-govt-dislodge-Cong-govt

ఆయనోక రాజకీయవేత్తగా మారిన ఆర్థిక రంగ నిపుణుడు. దివంగత ప్రధాని పీవీ నరసింహారావు హయాంలో ఆర్థిక పరిస్థితి దిగజారి ప్రభుత్వం బంగారం అమ్ముకునే పరిస్థితికి చేరుకున్నప్పుడు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గా తన మేధస్సుతో విదేశీ పెట్టుబడులను ఆకర్షించి గట్టెక్కించాడు. ఆపై పీవీ పిలుపుతోనే రాజకీయాల్లోకి వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ముందుగా ఆర్థిక శాఖ మంత్రిగా,  తర్వాతి కాలంలో దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ఏకబిగిన పదేళ్ల పాటు ఆయన దేశాన్ని పాలించారు. ఏం లాభం సోనియా చేతిలో కీలు బొమ్మ అనే ట్యాగ్ లైన్ తగిలించుకున్నారు. చివరికి కాంగ్రెస్ పార్టీ ఘోర పరాభవం నేపథ్యంలో మాజీ ప్రధానిగా మారిపోయారు. ఎవరి గురించి చెబుతున్నామో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా! ఆయనే మన్మోహన్ సింగ్

                            ప్రధానిగా ఉన్న సమయంలో కూడా ప్రతిపక్ష బీజేపీపై ఏనాడూ పన్నెత్తి మాట అనని ఆయన ఇప్పుడు నోరు తెరిచారు. అలా ఇలా కాదు ఏకంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీపైనే విరుచుకుపడ్డారు. ఎంతలా అంటే అసలు మాట్లాడింది ఆయనేనా అని సహచర నేతలు సైతం ఆశ్చర్యపోయేంతలా. ఇంతకీ విషయం ఏంటంటే.. విపక్ష పార్టీ హోదాలో కాంగ్రెస్ పార్టీ నిన్న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ‘సేవ్ డెమోక్రసీ’ పేరిట నిర్వహించిన నిరసన ప్రదర్శనలో ఆయన బీజేపీపైనే కాకుండా ప్రధాని నరేంద్ర మోదీపై కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అడ్రెస్ గల్లంతు కాక తప్పదన్న బీజేపీ విమర్శలపై ఆయన ఓ రేంజిలో విరుచుకుపడ్డారు. ‘‘బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఒకటే చెబుతున్నారు. దేశానికి కాంగ్రెస్ నుంచి విముక్తి కల్పిస్తామని చెబుతున్నారు. కానీ, మోదీ ప్రభుత్వానికి నేను ఒకటే చెబుతున్నా. కాంగ్రెస్ అనేది భారత ఆత్మ’’ దాన్ని ఎవరూ వేరు పరచలేరు అంటూ చెప్పుకోచ్చారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ