కేజ్రీని ఫాలో అవుతున్న చంద్రబాబు

September 12, 2015 | 02:05 PM | 1 Views
ప్రింట్ కామెంట్
AP-CM-chandra-babu-naidu-meet-people-at-Secretariat-niharonline

ఇంతకాలం పాలనాపరమైన చిక్కులతో సతమతమైన చంద్రబాబు ఇప్పుడు తన రూట్ ను మార్చుకుంటున్నాడు. ఏడాదిన్నర పాలనలో ఆయనతో ప్రజలను కలిసింది చాలా తక్కువ. విదేశీ పర్యటనలు, పెట్టుబడుల ఆహ్వనం తదితర అంశాలపై దృష్టిసారించటంతో కొన్ని పొరపాట్లు దొరిలాయి. కానీ, ఇదే టైంలో ప్రతిపక్షాలు ప్రజల్లోకి అంతగా దూసుకుపోకపోవటం బాబుకు చాలా కలిసి వచ్చింది. ఓటుకు నోటు లాంటి కీలక అంశాన్ని కూడా జనాల్లోకి తీసుకెళ్లటంలో వైసీపీ దారుణంగా విఫలమయిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. దీంతో ఇకపై జాగ్రత్తగా మసులు కోవాలని బాబు యోచిస్తున్నారు.

               ఇదే క్రమంలో ఆయన మదిలో ఓ సరికొత్త ఆలోచన మెదిలింది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తరహాలో ప్రజాదర్భార్ నిర్వహించాలని చంద్రబాబు నిర్ణయించారు. అయితే కేజ్రీలా వారానికి ఒకసారి కాకుండా, ప్రతిరోజు బాబు కలుస్తారట. సామాన్యులకు అందుబాటులో ఉండాలని నిర్ణయించుకున్న ఆయన శనివారం నుంచి రోజూ ఓ గంటపాటు ప్రజాదర్భార్ నిర్వహిస్తారట. విజయవాడలో ఏర్పాటు చేసిన క్యాంప్ కార్యాలయానికి ఎదుట ఇప్పుడు ఈ బోర్డు దర్శనమిస్తుంది. మధ్యాహ్నం 12 నుంచి 1 వరకు ఎవరైనా సరే చంద్రబాబును కలిసి తమ సమస్యలను మొరపెట్టుకోవచ్చునని అందులో ఉంది. అయితే ముఖ్యమంత్రిని కలవాలనుకునే వారు ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని ప్రకటించింది ఏపీ ప్రభుత్వం. ఇకపై ప్రజలతో ఆయనే స్వయంగా కలిసి వారిచ్చే వినతిపత్రాలను స్వీకరించి సమస్య పరిష్కారానికి కృషి చేస్తారట. లేట్ గా అయినా బాబు నిర్ణయం ఇప్పుడు కాస్త అభినందనీయమే.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ