చర్లపల్లి పట్టభద్రుడు

September 11, 2015 | 05:32 PM | 3 Views
ప్రింట్ కామెంట్
revanth-reddy-in-TTDP-president-race-niharonline

తెలంగాణ నాది.. రాయలసీమ నాది... అని నిండుగుండెతో ప్రజలందరూ తనవారే అని నినదించిన తారకరాముడి మానసపుత్రిక తెలుగుదేశం ప్రాంతీయంగా రెండుగా చీలిపోకతప్పలేదు. విధి బలీయం. మొన్నటి మహానాడుతో తెలంగాణ లో పార్టీ కమిటీ కాలం ముగిసింది. నూతన అధ్యక్షుడు, కార్యవర్గం ప్రెష్ గా రూపుదిద్దుకోవాలి. మాజీ మంత్రి రమణ, ఎర్రబెల్లి, రేవంతు ఇక్కడ నాయత్వానికి పోటీలో ఉన్నారు. రమణ, దయాకర్ తమ పావులు కదుపుకుంటున్నారు. ఇక రేవంతుది సెపరేట్ కథ. ఒక్క పిసరు అధిక్యంతతో కూడిన అవకాశం గల రేవంతు తనవంతు, ప్రయత్న లోపం లేకుండా చూసుకుంటున్నాడు. ప్రత్యర్థుల కంటె ఒడ్డు, పొడుగు కొలతలు కొంచెం నాసిగా ఉన్నప్పటికీ తనకున్న ఏకైక అర్హత ముందు వారందరూ బలాదూర్ అని నిబ్బరంగా ఉన్నాడు.

ఎవరయ్యా తన వలె పరువు, ప్రతిష్టలు, మానధనాలు పార్టీ కోసం పణంగా పెట్టినవారు అని బహు బింకంగా ఉన్నాడు. వెనుకాముందు ఆలోచన లేకుండా నేరుగా శత్రువు గుహలోకి రూపాయి కట్టలతో చొచ్చుకుపోయిన ఈ బుడతడి ధైర్యానికి, తెగువకు తగిన సన్మానం ఆశించడం తప్పేమీ? గీతాసారం ఒంట బట్టిచ్చుకున్న ఈ త్యాగశీలి, కర్మయోగి, తన ప్రయత్నం దిష్టగా ఆచరించి, దొరక్కపోవటం, దొరికిపోవటం అనేది చంద్ర భగవానుడికి వదిలేసిన ధీశాలి. ప్ర్యతర్థుల్లో ఎవరున్నారు ఇటువంటి సాహసి. చర్లపల్లి నుంచి వస్తూనే ఎన్ని బాంబులు పేల్చాడు. కేసీఆర్ ను ఎన్ని చిలిపిచేష్టలతో గిచ్చుతున్నాడు. భయం, భక్తి లేకుండా పైగా దొరవారిని పదవీ భ్రష్ఠుడిని చేసే వరకు నిద్ర పోనంటున్నాడు. దేశంలో ఎక్కడికైనా తిరిగి రాగల వెసులుబాటు కూడా కోర్టువారు దయచేశారు ఓటుకి నోటు అని కొందరు, ఓటుకి కోట్లు అని మరి కొందరు అభిమానంగా పిలుచుకునే ఈ తోపుకి సాటి ఎవ్వరు? జై తెలుగుదేశం... జై తెలంగాణ!

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ