ఛీ... ఛీ... ఇవేం వ్యాఖ్యలు మంత్రివర్యా?

March 25, 2015 | 01:20 PM | 65 Views
ప్రింట్ కామెంట్
jagadish_unparliament_language_in_TS_assembly_niharonline

నేతల అరుపులతో తెలంగాణ శాసనసభ దద్దరిల్లిపోయింది. మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ, టీఎస్ మంత్రి జగదీష్ రెడ్డిల మధ్య కొనసాగిన మాటల యుద్ధం సభను అట్టుడికేలా చేసింది. మహబూబ్ నగర్ జిల్లాలో విద్యుత్ ప్రాజెక్ట్ అంశంపై చర్చ సందర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ మాట్లాడుతూ... ‘‘మా జిల్లా విద్యుత్ ప్రాజెక్టులకు అనుకూలంగా లేదా? తెలంగాణలోని అన్ని జిల్లాలు విద్యుత్ ప్రాజెక్టులకు అనుకూలంగా ఉన్నాయి. సీఎం పక్షపాత బుద్ధిని చూపుతున్నారు’’ అంటూ విమర్శించారు. దీంతో ఆగ్రహానికి లోనైన జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ... ‘‘వైఎస్ బూట్లు నాకి ఎమ్మేల్యే పదవులు తెచ్చుకోలేదు. ప్రజల ఆశీర్వాదంతో గెలిచాం’’ అంటూ ఘాటుగా మాట్లాడారు. దీంతో కాంగ్రెస్ సభ్యులు నిరసన వ్యక్తంచేస్తూ స్పీకర్ పోడియం వద్దకు దూసుకెళ్లారు. దీంతో సభలో కాసేపు గందరగోళం నెలకొంది. మంత్రి వ్యవహారించిన తీరు సరిగ్గాలేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే చిన్నారెడ్డి అభ్యంతరం వ్యక్తంచేశారు. సభలో జరిగే చర్చలపై వాగ్వాదం పనికిరాదని... నేతలు ఓపికగా మాట్లాడాలని హితవు పలికారు. సభాసంప్రదాయాలను పాటించాలని కోరారు. ఇదిలా ఉండగా, తన మాటల్లో అభ్యంతకర వ్యాఖ్యాలుంటే రికార్డుల నుంచి తొలగించాలని మంత్రి జగదీశ్ రెడ్డి స్పీకర్ ను కోరారు. ఇంతవరకు కేవలం ఏపీ అసెంబ్లీ కే పరిమితమనుకున్న దూషణల పర్వం ఇప్పుడు తెలంగాణ శాసనసభకు కూడా తాకినట్లుంది. అయినా జగదీశ్ కు ఇదేం కొత్త కాదులేండి. గతంలో కూడా ఆయన ఇలాంటి వ్యాఖ్యలే చేసి తీవ్ర విమర్శల పాలయ్యారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ